NTV Telugu Site icon

Shiva Rajkumar: ‘పుష్ప’ జపం చేస్తున్న కన్నడ సూపర్ స్టార్

Shivanna

Shivanna

టైటిల్ చూసి కన్నడ సూపర్ స్టార్ ‘శివ రాజ్ కుమార్’, ‘పుష్ప’ సినిమాని రీమేక్ చేస్తున్నాడేమో అనుకోకండి. ఇది ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేద’లోని సాంగ్ గురించి. శివన్న ప్రస్తుతం ‘వేద’ అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. 1960ల కథతో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా సోల్ ఆఫ్ వేద టీజర్ ని గూస్ బంప్స్ వచ్చే రేంజులో కట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి ‘పుష్ప-పుష్ప’ అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఇటు చూడు పుష్ప, మాట్లాడు పుష్ప’ అనే అర్ధం వచ్చేలా ఉన్న ఈ పాట వినగానే క్యాచీగా హమ్ చేసేలా ఉంది. మంచి మాసీ బీట్ తో ‘అరుణ్ జెన్య’ ఇచ్చిన ట్యూన్ కి ‘నాగేంద్ర ప్రసాద్’ అందరూ ఈజీగా పాడుకునే లిరిక్స్ ని రాసాడు. ఇక శివన్నే స్వయంగా పడడంతో ‘పుష్ప-పుష్ప’ పాట పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటివరకూ ‘వేద’ సినిమా నుంచి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సీరియస్ నోట్ లో ఉండడంతో, ఇదో యాక్షన్ మూవీ మాత్రమే అనే ఫీలింగ్ లో ఉన్న ఆడియన్స్ కి ‘పుష్ప-పుష్ప’ సాంగ్ పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి.

శివన్న 125వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో ‘గనవి లక్ష్మణ్’ హీరోయిన్ గా నటిస్తోంది. శివన్న స్వీయనిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ‘హర్ష’ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ జెట్ స్పీడ్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రానుంది. శివన్న సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న కన్నడ సినీ అభిమానులకి కొత్త సంవత్సరం కాస్త ముందే స్టార్ట్ అవుతోంది. ‘వేద’ మూవీతో శివన్న సాలిడ్ హిట్ కొడతాడని ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Show comments