Site icon NTV Telugu

‘పుష్ప’ మూవీ లేటెస్ట్ అప్‌డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’… క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగనుంది. ఇందులో స్టైలిష్‌ స్టార్‌ మునుపెన్నడు చూడని విధంగా మాస్‌ లుక్‌తో అలరించబోతున్నాడు. మలయాళం స్టార్‌ హీరో ఫహద్‌ ఫాసిల్‌ ‘పుష్ప’ లో మెయిన్‌ విలన్‌గా నటిసున్నాడు. ఫహద్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పై చిత్ర యూనిట్ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఫాహద్ ఫస్ట్ లుక్ ను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇదివరకు ఫహద్‌ పుట్టినరోజు సందర్బంగా ఆయన కంటిని మాత్రమే పోస్టర్ లో చూపించి, పూర్తి లుక్ ను రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version