ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “పుష్ప” ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్న కథానాయికగా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న 5 భాషల్లో విడుదల కానుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అయితే సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడానికి మేకర్స్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. సుకుమార్ అయితే సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొనకుండా ఆఖరి నిమిషం వరకూ సినిమా పనుల్లోనే తలమునకలై ఉన్నారు. అయితే ఇంత చేసినా సినిమాను అనుకున్నట్టుగా విడుదల చేయలేకపోయారు మేకర్స్.
Read Also : అది జరగకపోతే షర్ట్ తిప్పేసి మైత్రీ ఆఫీస్ లో తిరుగుతా – అల్లు అర్జున్
“పుష్ప”రాజ్ 5 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, నాలుగు భాషల్లోనే విడుదల చేశారు. అల్లు అర్జున్ కు భారీగా క్రేజ్ ఉన్న కేరళలో ప్రమోషన్స్ అయితే చేయగలిగారు. కానీ సినిమా మలయాళ వెర్షన్ ను అనుకున్న సమయంలో వాళ్ళ ముందుకు తీసుకురాలేకపోయారు. ఈ మేరకు “పుష్ప ది రైజ్” మలయాళం వెర్షన్ షోలన్నీ రద్దు అయినట్టు సమాచారం. “మిక్స్‌ని ప్రింట్‌కి పంపడానికి ముందు QCని చేయడానికి సమయం దొరకలేదు. సిస్టమ్‌లోని బగ్ కారణంగా సింక్ సమస్యలు, ఇతర ఆడియో గ్లిచ్‌లు రావడంతో మలయాళం రిలీజ్ ఆలస్యం అయ్యింది అంటూ సినిమా సౌండ్ ఇంజినీర్ రసూల్ పూకుట్టీ వెల్లడించారు మేకర్స్ ముందుగా ప్రకటించినట్టుగా డిసెంబర్ 17న సినిమా విడుదల కాలేదు. కానీ వారిని ఎక్కువ నిరాశ పరచకుండా డిసెంబర్ 18నే ‘పుష్ప’రాజ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.
