NTV Telugu Site icon

Fahadh Faasil: పుష్పకు అవార్డ్.. రూ. 2 కోట్లు పెట్టి కొత్త కారు కొన్న షెకావత్ సారూ

Pushpa

Pushpa

Fahadh Faasil: ఇండస్ట్రీలో విలక్షణ నటుడు అని చాలా తక్కువ మందిని పిలుస్తారు. ఆ తక్కువ మందిలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఒకడు. పాత్ర ఏదైనా కానీ ఈ హీరో దిగినంతవరకు మాత్రమే.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, క్యామియో.. ఏదైనా సరే ఫహాద్ తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తాడు. ఈ మధ్యనే రిలీజ్ అయిన నాయకుడు సినిమాలో రత్నవేలుగా నటించి మెప్పించి.. హీరో కన్నా ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఇక తెలుగులో పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఫహాద్ ఫాజిల్. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అల్లు అర్జున్ కు ధీటుగా విలనిజాన్ని పండించి తెలుగువారి చేతనే శభాష్ అనిపించుకున్నాడు. పార్టీ లేదా పుష్ప.. అనే ఒక్క డైలాగ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

Samantha: విజయ్.. ఒక రౌడీ.. రెబల్.. ఆ అలవాట్లు.. షాక్ అయ్యాను

ఇక తాజాగా పుష్ప సినిమాకు గాను బన్నీకి నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇంకోపక్క ఫహాద్ ఫాజిల్ కు కూడా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఫహాద్ కొత్త కారును కొనుగోలు చేశాడు. ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన డిఫెండర్ అనే లగ్జరీ కారును ఈ హీరో సొంతం చేసుకున్నాడు. దీని ధర అక్షరాల రూ.2.11 కోట్లు అని తెలుస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ కారును ఫహాద్ తన భార్య నజ్రియాకు పెళ్ళి కానుకగా ఇచ్చినట్లు సమాచారం. ఈ మధ్యనే వారి వివాహ వార్షికోత్సవం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒకపక్క పుష్పకి నేషనల్ అవార్డు రావడం.. ఇంకో పక్క షెకావత్ కారు కొనడంతో అభిమానులు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీరు పుష్ప 2 లో నటిస్తున్నారు.ఈ సినిమాలో కూడా వీరిద్దరి నటన ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి వేరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారు చూడాలి.

Show comments