NTV Telugu Site icon

Pushpa 2: వర్కింగ్ స్టిల్సే ఈ రేంజ్ లో ఉంటే.. సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా

Sukumat

Sukumat

Pushpa 2: పుష్ప ఎక్కడ..? జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడ ఉన్నాడు..? గత రెండు రోజులనుంచి సోషల్ మీడియా పుష్ప ఎక్కడ..? అనే ప్రశ్నే నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప 2. పుష్ప చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబో ఈసారి మరిన్ని రికార్డులు కొట్టేయడానికి రెడీ అవుతుంది. ఇక రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి సుకుమార్ గట్టి ప్లాన్ వేశాడు. పుష్ప ఎక్కడ అనే చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేసి.. అభిమానుల్లో జోష్ పెంచేశాడు. పుష్ప ఎక్కడ ఉన్నదో రేపు చెప్తామని ప్రకటించారు. దీంతో అభిమానులందరూ పుష్ప ఎక్కడ.. ఎక్కడ..? అంటూ ఆలోచించడం మొదలుపెట్టేశారు. ఇక ఈ హీట్ ను ఇంకా పెంచడానికి మేకర్స్ రోజుకో అప్డేట్ ను అందిస్తున్నారు.

Kichcha Sudeep: సుదీప్ ప్రైవేట్ వీడియోలు.. తీసింది అతనే ..?

తాజాగా పుష్ప 2 వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేస్తూ.. ” రేపు బిగ్ రివీల్ చేయడానికి ముందు పుష్ప 2 సెట్ లో కొన్ని వర్కింగ్ స్టిల్స్ మీకోసం” అని క్యాప్షన్ పెట్టుకొచ్చారు. ఇక ఈ వర్కింగ్ స్టిల్స్ లో సుకుమార్ హైలైట్ అని చెప్పాలి. ప్రతిదీ పర్ఫెక్ట్ గా రావాలనుకొనే లెక్కల మాస్టారు .. అందరితోను కూర్చొని తనకు తగ్గ పర్ఫెక్షన్ వచ్చేవరకుచేయిస్తూనే ఉన్నట్లు కనిపించాడు. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, నాటునాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, పుష్ప విలన్ షెకావత్ ఆకా ఫాహద్ ఫాజిల్ కు సీన్స్ వివరిస్తూ కనిపించదు సుక్కు. వర్కింగ్ స్టిల్స్ లోనే ఈ రేంజ్ లో ఉంటే.. సినిమాను సుకుమార్ ఏ రేంజ్ లో తీశాడో అర్థంచేసుకోవచ్చు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మరి రేపు పుష్ప లుక్ తో సోషల్ మీడియాను ఏ రేంజ్ లో షేక్ ఆడిస్తారో చూడాలి.

Show comments