Pushpa 2: ఫ్యాన్స్ కు ప్రామిస్… పుష్ప 2 అంతకు మించి ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ కూడా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు వున్నాయి.’పుష్ప’ పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది… అయినా కూడా పుష్ప 2 హైప్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ వదిలిన సుకుమార్… ఈసారి పుష్పరాజ్ వేట మామూలుగా ఉండదని చెప్పేశాడు. ఇక ఇప్పుడు అంతకుమించి అంటూ… హైప్‌తోనే ఫ్యాన్స్ పోయేలా చేస్తున్నాడు సుకుమార్. ఆగష్టు 15న రానున్న పుష్ప 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న బన్నీ అభిమానులకు… మరింత హైప్ పెంచుతున్నాడు సుక్కు. తాజాగా ఓ ఇంటర్య్వూలో… ‘పుష్ప 2’ విశేషాలను పంచుకున్నాడు సుకుమార్.
Read Also: Deadpool & Wolverine: ఫేజ్-5ని ఈ సినిమా అయినా కాపాడుతుందా?
Also Read
సుకుమార్ మాట్లాడుతూ… “ఫ్యాన్స్ కు ప్రామిస్ చేస్తున్నా.. ‘పుష్ప’ కంటే ‘పుష్ప 2’ అంతకు మించి ఉంటుంది. పార్ట్ 2 సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా వచ్చింది. ‘భన్వర్ సింగ్ షెకావత్ మరియు పుష్పల మధ్య జరిగే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండబోతున్నాయి.. పుష్పరాజ్‌కి ఎదురయ్యే సమస్యలు.. దాన్ని అతను ఎదుర్కొన్న తీరు చాలా అద్భుతంగా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘పుష్ప 2’ సినిమాటోగ్రఫీ పై తనకు చాలా నమ్మకం ఉందని, ఖచ్చితంగా పార్ట్ 2 ప్రేక్షకుల అంచాలను మించి ఉంటుందని… తెలిపాడు. దీంతో రోజు రోజుకి పుష్ప2 పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. మరి ఈసారి పుష్పరాజ్ చేసే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్‌లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌కు భారీ జరిమానా..!
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
-
Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!