గత ఏడాది సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ తండ్రి భాస్కర్ తో NTV Exclusiveగా మా ప్రతినిధి మాట్లాడారు. ఈ సందర్భంగా భాస్కర్ తమ కుటుంబం పడిన బాధలను, ప్రస్తుత పరిస్థితిని వివరించారు. “గత ఏడాది ఇదే రోజు, ఇదే సమయానికి సంధ్య థియేటర్ లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో కోసం వచ్చాము. కానీ ఆ తొక్కిసలాటలో నా భార్య రేవతిని కోల్పోయాను” అంటూ భాస్కర్ గారు కన్నీటిపర్యంతమయ్యారు. ఆ క్లిష్ట సమయంలో మీడియా అందించిన సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Also Read :Megastar : ఆ విషయంలో వెనుకపడిన మెగాస్టార్ ?
విషాదం జరిగిన తర్వాత చికిత్స పొందిన శ్రీతేజ, నాలుగు నెలల క్రితం రీహాబ్ సెంటర్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ, ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ కుదుటపడలేదని భాస్కర్ తెలిపారు. శ్రీతేజకు ఇప్పటికే రెండు సార్లు సర్జరీలు జరిగాయి. “కానీ రికవరీ మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వైద్యులు చెప్పారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో పూర్తి స్థాయిలో వైద్యం అందించడం సాధ్యం కాకపోవడంతో, ఇప్పుడు మళ్లీ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అవసరం ఉందని భాస్కర్ స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీ వారు కొంతవరకు సహాయం అందించారని చెప్పిన భాస్కర్, శ్రీతేజకు మెరుగైన చికిత్స కోసం మరోసారి చిత్ర ప్రముఖులను సంప్రదించారు. “బాబును ప్రతి రోజు రీహాబ్ కి తీసుకురావడం ఇబ్బందిగా ఉంటోంది. అందుకు మరోసారి అల్లు అర్జున్ టీం, దిల్ రాజుతో మాట్లాడి సహకారం అడిగాము” అని భాస్కర్ తెలిపారు. దీనికి దిల్ రాజు సహకరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
Also Read :Deputy CM Pawan Kalyan: వర్షంలో రైతులను చూసి కాన్వాయ్ దిగిన పవన్ కల్యాణ్..
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిజియో థెరపీ ద్వారా, స్పీచ్ థెరపీ వంటివి చేస్తూ ఉంటే శ్రీతేజ రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భాస్కర్ గారు ఆశగా చెప్పారు. “నా భార్యను తిరిగి తీసుకురాలేము. కానీ బాబును బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే పిలిస్తే చూస్తున్నాడు. మా పాప డాన్స్ చేస్తుంటే చూస్తున్నాడు, స్మైల్ ఇస్తున్నాడు, చిన్నగా సౌండ్స్ చేస్తున్నాడు. బాబు బాగవుతాడని మాకు నమ్మకం ఉంది” అంటూ శ్రీతేజ తండ్రి భాస్కర్ తమ ఆశను వ్యక్తం చేశారు.
