NTV Telugu Site icon

Pushpa 2: వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లా… పుష్ప ఎక్కడ ఉన్నాడు?

Pushpa 2

Pushpa 2

బాహుబలి ది బెగినింగ్ ఎండ్ లో కట్టప్పనే బాహుబలిని చంపినట్లు చూపించి థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని దిమ్మతిరిగి పోయేలా చేశాడు రాజమౌళి. ఇక్కడి నుంచి దాదాపు రెండేళ్ల పాటు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? రాజమౌళి వేసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కదిలించింది. ఆయన కూడా పబ్లిక్ మీటింగ్ లో ‘కట్టప్ప బాహుబలికో క్యు మారా’ అని మాట్లాడారు. ఈ ప్రమోషనల్ స్టంట్ బాహుబలి ది కంక్లూషన్ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయ్యే వరకూ తీసుకోని వెళ్లింది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ సుకుమార్ అండ్ అల్లు అర్జున్ “వేర్ ఈజ్ పుష్ప” అంటున్నారు. #WhereIsPushpa అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో పుష్ప ది రూల్ నుంచి అప్డేట్ బయటకి వస్తుందని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఏప్రిల్ 8 కాదు ఒకరోజు ముందు ఏప్రిల్ 7న సాయంత్రం 4:05కే అప్డేట్ ఇవ్వబోతున్నాం అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రమోషనల్ వీడియో ప్రోమోని వదిలారు. ఇందులో “2004లో తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడ ఉన్నడ ఉన్నాడు?” అనే డైలాగ్ తో ప్రోమో మొదలయ్యింది. పుష్పకి సపోర్ట్ చేస్తూ ధర్నాలు చేస్తున్న పబ్లిక్, న్యూస్ పబ్లిష్ చేస్తున్న మీడియా, పోలీసుల క్లిప్పింగ్స్ ని ప్రోమోలో చూపించారు. అల్లు అర్జున్ లుక్ ని ఫుల్ వీడియోలో ఏప్రిల్ 7న రివీల్ చేస్తారేమో. అసలు పుష్ప పార్ట్ 1 ఎండ్ లో షెకావత్ సార్ కి వార్నింగ్ ఇచ్చి, నేరుగా పెళ్లి మండపంకి వచ్చి శ్రీవల్లిని పెళ్లి చేసుకున్న పుష్ప జైలుకి ఎందుకు వెళ్లాడు? షెకావత్ సార్ పుష్పని అరెస్ట్ చేశాడా?  జైలు నుంచి తప్పించుకోని అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడా? లాంటి చాలా డౌట్స్ ని ఒక్క వీడియోతోనే క్రియేట్ చెయ్యడంలో సక్సస్ అయ్యారు సుకుమార్ అండ్ టీం. మరి ఈ హంటింగ్ వీడియోలో ఏముందో తెలియాలి అంటే ఫుల్ వీడియో బయటకి వచ్చే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.