Pushpa 2 Movie Leaked Scene: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మొదటి భాగం తెరకెక్కిస్తున్నప్పుడే సినిమా రెండో భాగం కూడా ప్లాన్ చేశారు. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పుష్ప ది రూల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేస్తుండగా తాజాగా పుష్ప 2 షూటింగ్‍కు సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది.
Guntur Kaaram: ‘గుంటూరు కారం’కి డేట్స్ కష్టాలు.. మళ్లీ వాయిదా?
ప్రస్తుతం పుష్ప 2 మూవీ చిత్రీకరణ పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెం అనే గ్రామంలో అంటే దాదాపుగా పోలవరం పరిసరాల్లో సాగుతోంది. ఈ క్రమంలో షూటింగ్ చేస్తున్న సమయంలో దాన్ని స్థానికులు ఫోన్ లో షూట్ చేసి లీక్ చేశారు. ఆ వీడియో ప్రకారం ఎర్ర చందనం దుంగలు ఉన్న లారీలు నదిలో వేగంగా వెళుతున్నట్టు కనిపిస్తోంది. ఆ లారీలను వెంబడిస్తూ పోలీసులు జీపులు వస్తున్నాయి. సినిమాలో ఇది కీలకమైన సీన్ అని నదిలో లారీలు, జీప్‍లతో చేజింగ్ ఆసక్తికరంగా ఉండనుందని అంటున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న పుష్ప 2 పై ఫ్యాన్స్ లో అంచనాలను ఈ వీడియో మరింత పెంచేలా కనిపిస్తోంది.
Pushpa 2 Shooting..🚛#PushpaTheRule #Pushpa2 pic.twitter.com/07Xa0nODWc
— Bobby DHFM🔥🌶️ (@urstruly__bobby) June 16, 2023