Site icon NTV Telugu

Allu Arjun : పుష్ప2లో అదే హైలెట్‌..!

Pushpa2

Pushpa2

 

రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి.. కెజియప్.. సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపాయి. ఇదే ఫార్ములాతో రాబోతోంది పుష్ప మూవీ. అందుకే సెకండ్ పార్ట్‌ను భారీ బడ్జెట్‌తో.. బాలీవుడ్ ఆడియెన్స్ టార్గెట్‌గా.. భారీగా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఒక్కసారిగా మరింత అంచనాలను పెంచేశాడు సుకుమార్. మరి సుక్కు పుష్ప2 గురించి ఏం చెప్పాడు.. ఎలా ప్లాన్ చేస్తున్నాడు..?

గతేడాది ఎండింగ్‌లో వచ్చిన పుష్ప మూవీ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్.. ఆర్య, ఆర్య2 తర్వాత హ్యాట్రిక్ హిట్ కొట్టి.. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. దాంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో.. ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకముందే.. భారీ బినెస్ డీల్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ ఆఫర్స్ వస్తున్నట్టు వినిపించింది. ఇక ఇప్పుడు ఓవర్సీస్ రైట్స్ కోసం అదిరొపోయే ఆఫర్ వచ్చినట్టు టాక్. ఎంతలా అంటే.. బాహుబలి, RRR రేంజ్‌లో పుష్ప2 ఓవర్సీస్ రైట్స్‌ భారీ ధర పలుకుతోందట. అయితే అప్పుడే పుష్పరాజ్ బిజినెస్ చేశాడా.. లేదా అనేది అనుమానమే. ఇదిలా ఉంటే.. తాజాగా పుష్ప 2లో హైలెట్ ఇదేనంటూ.. ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సుకుమార్.

పుష్ప పార్ట్ వన్‌లో.. మళయాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్‌ పోలీస్ ఆఫీసర్ పాత్రలో.. విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. దాంతోసెకండ్ పార్ట్‌లో అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్ గా నిలువనుందని చెప్పుకొచ్చాడట సుకుమార్. అలాగే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా ఇంప్రెసివ్ గా ఉంటుందనీ, కొన్ని సీన్స్ అయితే అబ్బురపరుస్తాయని చెప్పాడట. దాంతో ఈ సారి సుకుమార్.. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో.. అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాను జులై నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. వీలైతే వచ్చే ఏడాది సమ్మర్‌.. లేదా డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న పుష్ప2.. ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version