Puri Jagannath: టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న సాయికుమార్ హైదరాబాద్ నగరంలోని దుర్గంచెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధను తట్టుకోలేకే సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
Read Also: Ponniyin Selvan: I : మణిరత్నంపై హృతిక్, ధనుష్ దాడి
అయితే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాతే అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్తున్నారు. సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ వద్ద సాయికుమార్ పని చేస్తున్నాడా.. లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల హీరో విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ మూవీ భారీ అంచనాలతో విడుదల కాగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. అనన్య పాండే హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమాకు ఛార్మి, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరించారు. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతోనే జనగనమణ అనే సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు.
