SlumDog Movie Teaser: టాలీవుడ్ హీరోలకు మాస్ ఇమేజ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్. గత కొంత కాలంగా ఆయనకు సరైన హిట్ లేదనే విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ (SlumDog – 33 Temple Road). పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ – జె.బి మోషన్ పిక్చర్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, టబు, సంయుక్త, దునియా విజయ్ కుమార్, జరీనా వహాబ్, వి.టి.వి గణేష్, బ్రహ్మాజీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నిన్ను ఎందుకు వదులుతాం” అంటూ సాగే భావోద్వేగభరితమైన డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టీజర్ అంతటా పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంది. ప్రతి పాత్రను చాలా ఇంటెన్సివ్‌గా చూపించారు మేకర్స్. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తుండగా, శామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సంతోష్ నూజిళ్ల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో త్వరలో ఈ చిత్రం థియేటర్లలో అలరించడానికి రెడీ అవుతుంది. పూరీ జగన్నాథ్ మార్క్ యాక్షన్, బలమైన ఎమోషన్స్‌తో కూడిన ఈ టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పూరీ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ ఆయన కంబ్యాక్‌ను గట్టిగా కోరుకుంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ స్లమ్‌డాగ్ టీజర్‌తో ఈసారి పూరీ పక్కా హిట్ కొడతాడని ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

