NTV Telugu Site icon

Puri- Charmi: ఏయ్.. ఏయ్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కెమెరా కంటికి చిక్కారు

Untitled 1

Untitled 1

Puri- Charmi: డైరెక్టర్ పూరి జగన్నాథ్- నటి, నిర్మాత ఛార్మీ మధ్య స్నేహ బంధాన్ని మించి ఇంకేదో ఉందని టాలీవుడ్ టాక్. ఛార్మీ వలనే.. పూరి, తన భార్య పిల్లలను పక్కన పెట్టాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక అంతేకాకుండా పూరితో రిలేషన్ వలనే ఛార్మీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని కూడా రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇక ఇవన్నీ వదిలేస్తే.. ప్రస్తుతం వారిద్దరూ బిజినెస్ పార్ట్నర్స్. పూరి కనెక్ట్స్ బ్యానర్ ను ఇద్దరు దగ్గర ఉండి నడిపిస్తున్నారు. ఇక గతేడాది రిలీజ్ అయిన లైగర్ సినిమాను తెరకెక్కించి చేతులు కాల్చుకున్నారు. ఆ తరువాత లైగర్ సినిమా పెట్టుబడుల్లో విదేశీ పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానికోసం ఈ జంటను ఈడీ విచారించింది. ఇక అప్పటి నుంచి ఈ జంట బయట ఎక్కడా కనిపించింది లేదు.

చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురయ్యిన స్టార్ హీరోయిన్లు వీరే..

లైగర్ ప్లాప్ తరువాత ఛార్మీ.. సోషల్ మీడియాకు కూడా టాటా చెప్పేసింది. దీంతో వారిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఇక చాన్నాళ్ల తరువాత ఈ జంట కెమెరా కంటికి చిక్కారు. నేటి ఉదయం పూరి- ఛార్మీ ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. ఇంత గ్యాప్ తరువాత ఈ జంట కనిపించేసరికి ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఇక పూరి కొత్త సినిమా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈసారి ఏ హీరోతో వచ్చి పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి.

Show comments