Site icon NTV Telugu

Liger: విజయ్ దేవరకొండ ఇంటిలో పూజలు!?

Vijaya Devarakonda

Vijaya Devarakonda

 

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ ఈ నెల 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఆల్ ఓవర్ ఇండియాలో మూవీ టీమ్ ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొంటోంది. ఇప్పటికే పలు నగరాలను కవర్ చేసిన విజయ్ దేవరకొండ టీమ్… మరో పది పన్నెండు రోజులు ఇదే పనిలో ఉండబోతోంది. ‘దేవుడి ఆశీస్సులు తమకు ఇప్పటికే లభించినా… తన తల్లి మరింత రక్షణ తమకు కావాలని కోరుకుంటోంద’ని విజయ్ దేవరకొండ తెలిపాడు.

అందుకోసం ఆమె ఇంటిలో పూజలు నిర్వహించిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. పురోహితులతో పూజలు జరిపించడమే కాకుండా తమ అందరి చేతులకు రక్ష తాయొత్తులు కట్టించిందని చెప్పాడు. వాటిని తాము ధరించడంతో ఇక ఆమె ప్రశాంతంగా నిద్రపోతుందని, తమ ప్రమోషనల్ టూర్ ను కొనసాగిస్తామని విజయ్ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. ‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే కూడా ఈ రక్షలు కట్టించుకుంది. విశేషం ఏమంటే.. విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ ఈ నెల 25న విడుదల కాబోతుండగా, దానికి ఆరు రోజుల ముందు అతని తమ్ముడు ఆనంద్ నటించిన ‘హైవే’ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది!

 

 

Exit mobile version