దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను నమోదు చేసిన ట్రిపుల్ ఆర్.. కేజీఎఫ్ 2 విడుదల తర్వాత కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు దాటి.. 5వ వారంలోకి అడుగుపెట్టేసింది. దాంతో ఆర్ఆర్ఆర్ మరో రికార్డును తన పేరిట రాసుకుంది. ట్రిపుల్ ఆర్ ఏకంగా 1100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. బాహుబలి2 తరువాత ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమాగా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇలా వరుసగా రెండు సినిమాలు వెయ్యి కోట్లు కొల్లగొట్టిన దర్శకుడిగా రాజమౌళి రికార్డ్ క్రియేట్ చేశారు. దాంతో బాహుబలి తర్వాత రాజమౌళి స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది ట్రిపుల్ ఆర్.
Watch Acharya Pre release Event Live :
ఈ నేపథ్యంలో జక్కన్న అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి నిత్యం ఆరా తీస్తునే ఉన్నారు జనాలు. రాజమౌళి కూడా ఇప్పటికే మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నానని ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. అయితే తాజాగా రాజమౌళి ఓ చిట్ చాట్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ట్రిపుల్ ఆర్ మూవీతో పాటు.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా హింట్ ఇచ్చాడు. అందులోభాగంగా.. తన మైండ్‌లో రెండు లేడీ ఓరియెంటేడ్ కథలు కూడా ఉన్నాయని వెల్లడించాడు. ఏ సమయంలోనైనా నా మైండ్‌లో చాలా స్టోరీ లైన్లు రన్ అవుతుంటాయి. వాటిలో నేను ఏదైనా చేయాలనుకుంటే.. మా నాన్న అప్ డేట్ చేస్తూ ఉంటాడని చెప్పుకొచ్చాడు. దాంతో నేను ఏ సినిమా అనుకుంటే ఆ సినిమా పట్టాలెక్కుతుందని అన్నారు. అంతేకాదు.. లేడీ ఓరియెంటెడ్ కథల్లో రెండు లైన్స్ రెడీగా ఉన్నాయి. వాటిలో ఒకటి కేరళ-కర్ణాటక ప్రాంతానికి చెందిన రాణి అబ్బక్కకు చెందిందని.. రెండోది సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీ అని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఎప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందో చెప్పాలేనని చెప్పుకొచ్చాడట. దీంతో రాజమౌళి నుంచి ఫ్యూచర్లో ఓ లేడి ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.
