మూవీ మేకింగ్ మాస్టర్ గా, స్టొరీ టెల్లింగ్ జీనియస్ గా పేరున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 2, ఇతర భాషల్లో PS-2 అనే టైటిల్ తో ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ మైంటైన్ చేస్తోంది. గతేడాది రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది. రెండు రోజుల్లోనే వంద కోట్ల బెంచ్ మార్క్ రీచ్ అయిన పొన్నియిన్ సెల్వన్ 2, ఇప్పటివరకూ 300 కోట్లని రాబట్టింది. ఇప్పటికే తమిళ ప్రజలు ఉన్న ప్రాంతాల్లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా ఓవరాల్ గా థియేట్రికల్ రన్ లో 350 నుంచి 380 కోట్ల వరకూ కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదే జరిగితే పొన్నియిన్ సెల్వన్ రెండు పార్ట్శ్ కలిసి బాక్సాఫీస్ దగ్గర 800-850 కోట్లు రాబట్టినట్లు అవుతుంది. మొదటి పార్ట్ కే పెట్టిన బడ్జట్ వచ్చెయ్యడంతో, సెకండ్ పార్ట్ కలెక్ట్ చేస్తున్న ప్రతి రూపాయి ప్రాఫిట్స్ కిందకి వెళ్లిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఇంత ప్రాఫిటబుల్ సినిమా ఇంకొకటి రాలేదు. పార్ట్ 2కి ఇతర ప్రాంతాల్లో మరింత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేసి ఉంటే కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా ఉండేవి కానీ మేకర్స్ రిలాక్స్ అయిపోవడంతో పొన్నియిన్ సెల్వన్ 2 కలెక్షన్స్ తమిళనాడుకి మాత్రమే పరిమితం అయ్యాయి. PS-2 పార్ట్ 1 తెచ్చిన నెగటివ్ టాక్ ని చెరిపేసింది కానీ కలెక్షన్స్ లో మాత్రం ఇప్పటికీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 టాప్ లో ఉంది. మరి ఈ ఇయర్ ఏ తమిళ మూవీ PS-2 కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి.
