NTV Telugu Site icon

Project K: ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ రివీల్.. ఫ్యాన్స్ కు పండగే ?

Prabhas

Prabhas

Project K: ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఎన్ని విమర్శలు అందుకున్నాడో అందరికి తెల్సిందే. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆ విమర్శల నుంచి బయటకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ సలార్ , ప్రాజెక్ట్ కె మీదనే పెట్టుకున్నారు. సలార్ టీజర్ జూలై 7 న రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో కొద్దిగా సంతోషం వ్యక్తం చేసిన అభిమానులకు.. మరో సినిమా అప్డేట్ కూడా వచ్చే నెలలో ఉండబోతుంది అని తెలిసే సరికి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ప్రాజెక్ట్ కె.. ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, హిట్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Akkineni Nagarjuna: నాగార్జున.. ఇక దానికే పరిమితమా..?

ఇక ఈ సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. వచ్చే నెలలోనే ప్రాజెక్ట్ కె.. ఒరిజినల్ టైటిల్ ను మేకర్స్ రివీల్ చేయనున్నారట. ప్రాజెక్ట్ కె అనేది వర్కింగ్ టైటిల్ అన్న విషయం తెలిసిందే. మొదట్లో అలాగే అనుకున్నా ఇప్పుడు సినిమా పేరే ప్రాజెక్ట్ కె అనేంతగా ఫేమస్ అయిపోయింది. ఇక నాగ్ అశ్విన్.. ఎట్టకేలకు ఆ వర్కింగ్ టైటిల్ నుంచి అభిమానులకు విముక్తి కలిగించనున్నాడట. టైటిల్ మోషన్ పోస్టర్ ను జూలై లో అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చే నెలలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. మరి త్వరలో ఈ విషయమై మేకర్స్ అధికారిక ప్రకటన ఏమైనా ఇస్తారేమో చూడాలి.