Site icon NTV Telugu

Project K Merchandise: ప్రాజెక్ట్ కే అంటే ఏంటి.. ఈ టీ-షర్ట్స్ సొంతం చేసుకోండి

Project K Merchandise

Project K Merchandise

Project K Unit Released What Is Project K Merchandise For Fans: మన భారతీయ చిత్రసీమలో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ప్రాజెక్ట్ కే ఒకటి. ప్రభాస్, కమల్ హాసన్, అమితాభ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పతాని వంటి భారీ స్టార్‌కాస్ట్‌తో.. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తొలుత పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకున్నారు కానీ, ఇప్పుడిది పాన్ వరల్డ్ సినిమాగా రాబోతోంది. అలాంటప్పుడు అంచనాలు మామూలుగా ఉంటాయా? బహుశా తారాస్థాయి అనే మాట కూడా చిన్నదే అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ నుంచి కొత్త అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అంటూ కళ్లు కాయలు కాచేలా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. చిత్రబృందం కూడా అప్పుడప్పుడు క్రేజీ అప్డేట్స్‌తో సినీ ప్రియుల్ని మెస్మరైజ్ చేస్తోంది.

Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలతో కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!

జులై 20వ తేదీన శాన్‌డియాగో కామికాన్ వేడుకలో ఈ సినిమా టైటిల్‌ని రివీల్ చేయబోతున్నట్టు మేకర్స్ రీసెంట్‌గానే ప్రకటించారు. ఆ తర్వాత ‘ప్రాజెక్ట్ కే అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా?’ అంటూ ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సర్‌ప్రైజ్‌ని రివీల్ చేస్తూ.. మెర్చండైజ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా.. ‘ప్రాజెక్ట్ కే అంటే ఏంటి?’ అని రాసి ఉన్న ఓ టీషర్ట్‌ని అందుబాటులో ఉంచారు. అయితే.. దీన్ని సొంతం చేసుకోవాలంటే, చాలా వేగంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ యూనిట్ పొందుపరిచిన లింక్‌ని క్లిక్ చేసి, ఆపై ఓపెన్ అయిన విండోలో ‘పసుపు రంగులో’ ఉంటే కంటిన్యూ బటన్‌ని నొక్కాలి. దాన్ని నొక్కగానే.. మన పేరుతో పాటు ఈమెయిల్‌ని పొందుపరచాలి. అప్పుడు మనకు కావాల్సిన సైజ్‌లో టీషర్ట్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అంతే.. ఈ సింపుల్ స్టెప్స్‌తో ప్రాజెక్ట్ కే టీజర్ట్‌ని మీరు సొంతం చేసుకోవచ్చు.

Naga Shaurya: ‘సారీ’ చెప్పిన నాగశౌర్య.. ఎందుకంటే?

Exit mobile version