Site icon NTV Telugu

Project K: హ్యాపీ బర్త్ డే కెప్టెన్… పాన్ వరల్డ్ సినిమా ఇచ్చేయ్…

Project K

Project K

నాగ్ అశ్విన్… ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, రెండో సినిమా మహానటితో ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ తన వైపు చూసేలా చేశాడు. మహానటి సావిత్రి కథతో కీర్తి సురేష్ ని పెట్టి మహానటి సినిమా చేసిన నాగ్ అశ్విన్ సౌత్ ఇండియా హిట్ కొట్టాడు. ఈసారి అంతకు మించి అన్నట్లు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ‘ప్రాజెక్ట్ K’ సినిమా చేస్తున్నాడు. ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్, ప్రాజెక్ట్ K సినిమాలో హీరో అనగానే అదో సెన్సేషన్ అయ్యింది. ఇప్పటివరకూ చూడని ఒక ఇమేజినరీ వరల్డ్ ని క్రియేట్ చేసి నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ సినిమా చేస్తున్నాడు.

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారి బడ్జట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ K సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటివరకూ వరల్డ్ ఆఫ్ ప్రాజెక్ట్ Kని మాత్రమే చూపిస్తూ వచ్చిన నాగ్ అశ్విన్ త్వరలో ప్రభాస్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈరోజు నాగ్ అశ్విన్ బర్త్ డే కావడంతో వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి విషేస్ చెప్తూ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని వైరల్ చేస్తూ ‘హ్యాపీ బర్త్ డే కెప్టెన్’ అంటూ ప్రభాస్ ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. ఈ ఇయర్ ప్రాజెక్ట్ K షూటింగ్ చేస్తున్న నాగ్ అశ్విన్ నెక్స్ట్ ఇయర్ పాన్ వరల్డ్ డైరెక్టర్ అవుతాడేమో చూడాలి.

Exit mobile version