NTV Telugu Site icon

Project K: ‘ప్రాజెక్ట్ కె’ కామిక్ ఆర్ట్ పోస్టర్స్ లీక్.. స్టోరీ తెలిసిపోయింది.. ?

Prabhas

Prabhas

Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ ను నేడు అమెరికాలోని శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్న విషయం తెల్సిందే. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా స్టోరీకి సంబంధించిన కామిక్ పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కామిక్ ఆర్ట్స్ రూపంలో రిలీజ్ అయిన ఈ పోస్టర్స్ లో ప్రాజెక్ట్ కె స్టోరీని చెప్పేశారు. ఒకానొక కాలంలో కొంతమంది రాక్షసులు.. వారి దేవుడిని గౌరవించాలని, అతడినే దేవుడిగా కొలవాలి అని ప్రజలను హింసిస్తారు.

Prabhas: ఇది కదా.. మిలియన్ డాలర్ పిక్ అంటే..

ప్రజలు ఎన్ని బాధలు పెట్టినా వారి దేవుడిని.. దేవుడుగా ఒప్పుకోరు. ఇక రాక్షసులు రెచ్చిపోయి ప్రజలను.. ఒప్పుకొంటే తమ దేవుడినే ఒప్పుకోవాలని, మీ కోసం ఏ దేవుడు దిగిరాడని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక దేవుడి రూపంలో ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడ నుంచి దేవుడుకు రాక్షసులకు జరిగే యుద్ధమే ఈ ప్రాజెక్ట్ కె అని తెలుస్తోంది. ఇక రాక్షస దేవుడిగా కమల్ కనిపిస్తుండగా.. ప్రజల కోసం పోరాడే దేవుడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. అందరు అంటున్నట్లే కల్కిగా ప్రభాస్ కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ఇదే కనుక నిజమైతే.. బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.అంతేకాకుండా రేపు రిలీజ్ అయ్యే ఫస్ట్ గ్లింప్స్ లో కూడా ఇదే చూపించనున్నారని టాక్. మరి ఫస్ట్ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలనుంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Show comments