Site icon NTV Telugu

Breaking : కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కానున్న నిర్మాతలు..

Tollywood (2)

Tollywood (2)

టాలీవుడ్ లో గత 9 రోజులుగా షూటింగ్స్ కు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిన్న, మిడ్ రేంజ్ నుండి భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో బిగ్ బడ్జెట్ సినిమాల నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి. ఎదో ఒకటి తేల్చాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ విషయమై కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కాబోతున్నారు నిర్మాతలు. నిర్మాతల సమావేశం అనంతరం ఫెడరేషన్ సమావేశం కాబోతుంది.

Also Read : WAR 2 : ఎన్టీఆర్, హృతిక్ ‘వార్’ 2 ఫస్ట్ రివ్యూ..

నిర్మాతలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఛాంబర్ ను కోరుతూ లేక ఇవ్వనున్నారు ఫెడరేషన్ సభ్యులు. ఫెడరేషన్ లేఖ ఇచ్చాక నిర్మాతలు మరియు ఫెడరేషన్ సభ్యులు కలిసి సమావేశం అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు  నిర్మాతలు ఇటు ఫెడరేషన్ సభ్యులు నిన్నతెలంగాణ ఫిల్మ్ ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో వేర్వేరుగా సమావేశమయ్యారు. అందరికి ఆమోదయోద్యమైన నిర్ణయం తెసుకోవాలని సూచించారు. ఈ సమస్యను త్వరగా ముగించాలని చెప్పారు. ఈ నేపధ్యంలో నేడు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు సమావేశం అయి మంత్రి మాట ప్రకారం చర్చలను క్లోజ్ చేసి వివాదానికి తెర దించుతారా లేదా అని చర్చ నడుస్తోంది. మరోవైపు ఈ చర్చలు ముగించి షూటింగ్స్ ను త్వరగా స్టార్ట్ చేయాలని భారీ చిత్రాల నిర్మాతలు కోరుతున్నారు. కొన్ని సినిమాలు షెడ్యూల్ సగంలో ఉండగా బంద్ ప్రకటించడంతో పెండింగ్ లో ఉన్నాయి. ఈ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాల షూటింగ్స్ కూడా కొన్ని పెండింగ్ లో ఉండిపోయాయి. మరి నేడు జరగబోయే నిర్మాతలు, ఫెడరేషన్ చర్చలు కొలిక్కివస్తాయేమో చూడాలి.

Exit mobile version