Daggubati Family: మొట్ట మొదటిసారి దగ్గుబాటి ఫ్యామిలీ వివాదంలో చిక్కుకొంది. ఇప్పటివరకు సినిమాలు, కుటుంబం తప్ప బయట ఏ వివాదంలోనూ ఇరుక్కొని వెంకటేష్ భూ వివాదంలో ఇరుక్కున్నారు. తనను దగ్గుబాటి ఫ్యామిలీ మోసం చేసింది అంటూ సదరన్ స్పైసిస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నందకుమార్ మీడియా ముందుకు రావడం చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. దగ్గుబాటి ఫ్యామిలీ మోసం చేసిందంటూ నందకుమార్ ఇటీవలే కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఫిల్మ్ నగర్ దగ్గర్లో ఉన్న 1200 గజాల భూమిని తనకు లీజుకు ఇచ్చి అగ్రిమెంట్ పూర్తి కాకుండానే తనను స్థలం ఖాళీ చేయమని దగ్గుబాటి ఫ్యామిలీ వేధిస్తోందని తెలిపారు.
ఇక నేడు పురానీ హవేలీ లోని సిటీ సివిల్ కోర్టు వద్ద మీడియా ఎదుట నందకుమార్ మాట్లాడుతూ “దగ్గుబాటి కుటుంబం నన్ను మోసం చేసింది. నాతో అగ్రిమెంట్ చేఉకున్న భూమిని నాకు తెలియకుండా రానా పేరు మీదకు మార్చి అమ్మకానికి పెట్టారు. సురేష్ బాబు మాత్రమే కాకుండా వెంకటేష్ కూడా నన్ను మోసం చేశారు. ఆయన కూడా లీజ్ కు ఇచ్చిన అగ్రిమెంట్ ను మర్చిపోయి స్థలం ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు. అందుకే నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కేసు విచారణకు రానా రాలేకపోవడంతో ఈ కేసును ఆగస్టు 2 కు వాయిదా వేశారు. ఇప్పటివరకు ఈ కేసు గురించి దగ్గుబాటి ఫ్యామిలీ నోరు మెదపకపోవడం విశేషం.
