తాజాగా, తన ‘కె ర్యాంప్’ సినిమా సక్సెస్ మీట్‌లో ఒక వెబ్‌సైట్‌ను టార్గెట్ చేస్తూ నిర్మాత రాజేష్ దండా తీవ్రస్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఒకరకంగా ఆయన అసభ్యకర మాటలు కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు ఒక లెటర్ రిలీజ్ చేశారు. సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని డిజిటల్ పబ్లిషింగ్ సంస్థలు తమ అసోసియేషన్‌లో భాగమై ఉన్నాయని, తమ అసోసియేషన్ రాజేష్ దండా వ్యాఖ్యలను ఖండిస్తుందని చెప్పుకొచ్చింది.
Also Read :Naga Vamsi: లోక’పై నాగవంశీ లాజిక్స్.. లాజిక్ లెస్
ఏవైనా ప్రొఫెషనల్ డిఫరెన్సెస్ ఉంటే గౌరవ మర్యాదలతో వాటిని వెల్లడించాల్సి ఉంది. పబ్లిక్‌గా మాట్లాడే అవకాశం ఉంది కదా అని ఒకరిని నొప్పించేలా, భయపెట్టేలా లేదా గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడకూడదు. అలాంటి బిహేవియర్ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. పబ్లిక్‌గా వార్నింగ్ ఇవ్వడం, హాని చేసేలా వైలెన్స్ ప్రేరేపించేలా మాట్లాడటం చట్ట ప్రకారం క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. మరోసారి సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. మీడియా హౌస్‌లను కానీ, జర్నలిస్టులను కానీ అవమానించేలా మాట్లాడినా, అసభ్యకరంగా మాట్లాడినా లేక వారిని భయపెట్టేలా మాట్లాడినా మేము చూస్తూ ఊరుకోం. పత్రికా స్వేచ్ఛ కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము అంటూ ఒక లేఖ రిలీజ్ చేశారు. అయితే అంతకుముందే రాజేష్ దండా మరోసారి అదే వెబ్‌సైట్ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తన వెర్షన్ వినిపించారు.
