NTV Telugu Site icon

TarakaRatna: తారకరత్న గుండె ఆగింది.. కానీ, బాలయ్యే ప్రాణం పోసాడు..?

Tarakaratna

Tarakaratna

TarakaRatna: నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్న విషయం తెల్సిందే. గత మూడు రోజులుగా ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న.. ఇప్పటివరకు కన్ను తెరవలేదు. అయితే తీవ్రమైన గుండెపోటుకు గురిఅయ్యినట్లు వైద్యులు తెలిపారు. అంతేకాకుండా ఆయన అరుదైన వ్యాధితో పోరాడుతున్నారని, ఆయన గుండె నాళాలు 95 శాతం మూసుకుపోయాయని చెప్పుకొచ్చారు. ఇక దేవుడి మీదనే భారం వేసిన వైద్యులు తమవంతు కృషి చేయడానికి సిద్ధమయ్యారు. నందమూరి కుటుంబంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. మూడు రోజుల తరువాత అభిమానులకు వైద్యులు శుభవార్త వినిపించారు. అంతకు ముందు చికిత్సకు సహకరించని తారకరత్న శరీరం.. ఇప్పుడు కొద్దికొద్దిగా సహకరిస్తోందని చెప్పారు.

ఇక దీనికి కారణం నందమూరి బాలకృష్ణ అని నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తుడు, ప్రొడ్యూసర్ సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఏవేఓ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. “తారకరత్న కోలుకుంటున్నారు. ఆయన కాళ్ళు, చేతులు కదుపుతున్నారు. కుప్పంలో ఆయన సొమ్మసిల్లి పడిపోగానే దాదాపు 45 నిముషాలు గుండె ఆగింది. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ చేసిన పని అద్భుతం. తారకరత్న
అపస్మాకర స్దితిలో ఉన్నప్పుడు బాలకృష్ణ మాట వినిన వెంటనే చలించారు. బాలకృష్ణ వెళ్ళి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివాడు. మృత్యంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగింది. అప్పుడే చేతులు, కాళ్లు కదిలాయి. చేతి వేళ్ళకదలికలు ఉంటే మెదడు కూడా బాగానే పనిచేస్తుందని డాక్టర్లు అన్నారు.

బ్రెయిన్ ఫక్ంక్షనింగ్ ఎంత టైం పడుతుంది అనేది డాక్టర్లు నిర్దారించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకండి. తారకరత్న వందశాతం సేఫ్ గా ఉన్నాడు. ఆయనకు ఏదో అయ్యింది.యువగళం వలన డిక్లేర్ చేయటం లేదనే వార్తలు అవాస్తవం. ఎక్మో, స్టంట్ అనేదే జరగలేదు. హార్ట్, కిడ్నీ, లివర్ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే మేలెనా, స్మెల్ వస్తుంది అనే మాటలు పచ్చి అబద్దం. సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ లేని యాక్టర్ తారకరత్న. ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ప్రార్దనలు చేస్తున్నారు. కుటుంబం అంతా దగ్గరుండి మానెటరింగ్ చేస్తున్నారు. అసలు అనిల్ రావిపూడి సినిమాలు విలన్ గా తారకరత్న ను బాలకృష్ణ అనుకున్నారు. అంతలోనే ఇలా జరిగింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments