Site icon NTV Telugu

Kingdom : హమ్మయ్య కింగ్డమ్ నిర్మాత గట్టిక్కినట్టే.. OTT ఎంత వచ్చిందంటే

Kingdom

Kingdom

రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా  జెర్సీ ఫేమ్  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు కొడుతున్న విజయ్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్న్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు.

Also Read : Tollywood : OG vs అఖండ 2.. అసలు ఏంటీ పోస్ట్ పోన్ గోల

కాగా ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కవ అయినట్టు టాలీవుడ్ లో టాక్. అయితే ఓటీటీ రూపంలో నిర్మాత నాగవంశీ ఆల్మోస్ట్ సేఫ్ అయ్యాడు. కింగ్డమ్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో బడ్జెట్ లో సగం ఓటీటీ రూపంలోనే రాబట్టడం నిర్మాతకు జాక్ పాట్ అనే చెప్పాలి. ఇక మ్యూజికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. సితార సంస్థకు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కాబట్టి థియేట్రికల్ రైట్స్ కు భారీగానే అడ్వాన్స్ లు వస్తాయి. సినిమా టాక్ కాస్త బాగున్నా కూడా రూ. 60 నుండి రూ. 75 కోట్లు రాబట్టడం అనేది కష్టమేమి కాదు. ఎటొచ్చి సూపర్ హిట్ టాక్ రావాలి. అసలే వరుస ప్లాప్ లు కొడుతున్న విజయ్ డే 1 ఏ మేరకు రాబడతాడు అని ట్రెడ్ ఎదురుచూస్తుంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న కింగ్డమ్ ఈ నెల 31న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది.

Exit mobile version