బుల్లితెర యాంకర్ రష్మీ ఒక పక్క టీవీ షోలలో.. ఇంకోపక్క సినిమాలలో నటిస్తూ మెప్పిస్తుంది. ఇక సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపి మరింత పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం చిరు సరసన నటించే అవకాశం పట్టేసింది. ఇకపోతే రష్మీ గురించి ఒక నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రాణి గారి బంగ్లా చిత్ర నిర్మాత నాగ లింగం.. రష్మీ తనను బెదిరించిందని, ఆ కాల్ రికార్డ్ ఇంకా తన దగ్గర ఉందని చెప్పుకొచ్చాడు.
” రాణి గారి బంగ్లా సినిమా చేసేటప్పుడు రష్మీ.. నాతో చాలా దురుసుగా వ్యవహరించింది. సినిమా సగం షూటింగ్ అయిపోయాక ఒక సాంగ్ చేయాల్సి వచ్చింది. అందులో తానూ నటించలేనని, హీరోను మార్చమని గొడవకు దిగింది. సినిమా సగం షూటింగ్ అయ్యాక హీరోను ఎలా మారుస్తామని నచ్చజెప్పినా.. వినలేదు.. షూటింగ్ క్యాన్సిల్.. నేను రాను అంటూ చెప్పుకొచ్చిది. అంతేకాకుండా.. నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు అంటూ బెదిరించింది. దీంతో నేను కూడా అదే విషయం చెప్పాను. ఇండస్ట్రీలో ఇనాళ్ళుగా ఉంటున్నాను.. నీకె కాదు నాక్కూడా అందరూ తెలుసు.. షూటింగ్ మధ్యలో ఆపేస్తే నీపై లీగల్ గా కేసు పెడతా.. ఫిల్మ్ నగర్ గేటుకు కట్టేసి కొడతానని చెప్పడంతో రష్మీ దిగివచ్చి మిగతా షూటింగ్ ని కంప్లీట్ చేసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. నా వయస్సు ఎంత.. ఆమె వయస్సు ఎంత.. ఇలా మాట్లాడొచ్చా.. ఆమెతో ఆలా నేను మాట్లాడడం కూడా న్యాయం కోసమే.. ఇవన్నీ పక్కన పెడితే ఆమె మంచి నటి.. ఏ సీన్ కి ఎక్స్ట్రా టేక్ తీసుకోలేదు ” అని చెప్పుకొచ్చాడు.
