Producer C Kalyan Sensational Comments On TFPC Elections: ఫిబ్రవరి 19న తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అధ్యక్షుడు సీ. కళ్యాణ్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఉందని, అదెప్పుడూ బాగుండాలని తమ కోరిక అని తెలిపారు. ఎన్నికల కోసం పది మంది సభ్యులు టెంట్ వేశారని, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. 19న ఎన్నికలు నిర్వహించి, సాయంత్రం కౌంటింగ్ జరిపిస్తామన్నారు. అదే రోజు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంటుందని పేర్కొన్నారు.
Ukraine War: ఉక్రెయిన్ లో కుప్పకూలిన హెలికాప్టర్..హోంమంత్రి సహా 16 మంది మృతి
టీఎఫ్‌పీసీ కమిటీపై కొందరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారని, అలాంటి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని కళ్యాణ్ వెల్లడించారు. మా సభ్యుల్లో కే. సురేష్ బాబుని మూడేళ్లు.. యలమంచిలి రవిచంద్‌ను జీవిత కాలం బహిష్కరిస్తున్నామని బాంబ్ పేల్చారు. ఆర్గనైజేషన్‌కి ఎవరు చెడ్డ పేరు తేవాలని చూసిన ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు జరగట్లేదని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు ఎలాంటి పదవి వ్యామోహం లేదన్నారు. మా కౌన్సిల్‌లో ప్రస్తుతం 9 కోట్ల ఫండ్ ఉందన్నారు. ఇంత డబ్బు పోగవ్వడానికి దాసరి నారాయణ రావు కారణమన్నారు.
BRS First Public Meeting Live: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
కొందరు పదవుల కోసం కొన్ని సంస్థలు పెడుతున్నారని.. అవేవీ టీఎఫ్‌సీపీలో భాగం కాదని కళ్యాణ్ స్పష్టం చేశారు. నంది అవార్డుల కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు. ఆంధ్రలో నంది అవార్డులు, తెలంగాణలో సింహా అవార్డులు త్వరగా ఇవ్వాలని కోరారు. లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ తరుపున అవార్డులను తామే ఇస్తామని సీ. కళ్యాణ్ తేల్చి చెప్పారు.
BK Hari Prasad : ‘ఆ ఎమ్మెల్యే వ్యభిచారి’..కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్