Site icon NTV Telugu

7/G Brundavan Colony: బ్రేకింగ్.. కల్ట్ క్లాసిక్ కు సీక్వెల్ ప్రకటించిన నిర్మాత.. ఈసారి హీరో ఎవరంటే.?

Ravi

Ravi

7/G Brundavan Colony: మేము వయసుకు వచ్చాం.. పరువానికి వచ్చాం.. ఈ ఇరవై ఏళ్లు అరే వ్యర్థం చేశాం అనే సాంగ్ వినపడగానే కుర్రాళ్ళు మా జీవితమే అని చెప్పేస్తారు. ఇక కన్నుల బాసలు తెలియవులే.. కన్నెల మనసులు ఎరుగవులే అనే సాంగ్ రాగానే బ్రేకప్ బ్యాచ్.. మేము పాడుకొనే సాంగ్ అని చెప్పేస్తారు. ఇక కలలు కనే కాలాలు.. కరిగిపోవు హృదయాలు అనగానే లేత లేత ప్రేమికుల విరహ భాద కనిపించేస్తోంది.. ఇక ఈ సాంగ్స్ అన్ని మదిలోకి రాగానే వినిపించే ఒకే ఒక్క పేరు 7G బృందావన్ కాలనీ. రవి కృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2004 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అర్జున్ రెడ్డిని ఎలా చెప్పుకుంటున్నామో.. అప్పట్లో ఈ సినిమా గురించి మాట్లాడుకునేవారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాలోనే సీన్స్ మీమర్స్ వలన సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సినిమాను నిర్మించింది ఏఎం రత్నం. అదేనండీ.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు ను నిర్మిస్తున్న నిర్మాత. తాజాగా ఆయన ఈ కల్ట్ క్లాసిక్ కు సీక్వెల్ ప్రకటించాడు.

ఎన్టీవీ జరిపిన ఒక ఇంటర్వ్యూలో ఆయన 7G బృందావన్ కాలనీ కి సీక్వెల్ రానుందని తెలిపారు.. సీక్వెల్ లో కూడా హీరో రవికృష్ణనే అని, దర్శకుడు గా కూడా సెల్వ రాఘవన్ నే అనుకుంటున్నట్లు.. ఆ ప్రయత్నాలే చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ఈ సీక్వెల్ త్వరగా సెట్స్ మీదకు వెళ్లాలని కోరుకుంటున్నారు. ఇక మరోపక్క దర్శకుడు సెల్వ రాఘవన్.. 7G బృందావన్ కాలనీ ని టైటానిక్ తో పోలుస్తూ.. అదే సినిమాను కాపీ చేసి తీశానని, దానికి సీక్వెల్ చేయడం అనేది కుదరదని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. మరి ఏఎం రత్నం ఆయనను ఒప్పిస్తాడా..? లేక కొత్త దర్శకుడితో ఈ సీక్వెల్ ను కొనసాగిస్తాడా..? అనేది చూడాలి.

Exit mobile version