Proddatur Dussehra : దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకునే ప్రాంతాల్లో ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ ఏటా ఇక్కడ జరిగే దసరా వేడుకలు కళాత్మకంగా, భక్తి శ్రద్ధలతో నిండిపోయి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తుంటాయి. ఈ అపూర్వ ఉత్సవాన్ని మరింత మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ మురళీ కృష్ణ తుమ్మ తెరకెక్కించిన “ప్రొద్దుటూరు దసరా” డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ఈ డాక్యుమెంటరీని నిర్మాత ప్రేమ్ కుమార్ వలపల నిర్మించారు. గత అక్టోబర్ 31న రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దసరా సంబరాలు, ప్రజల సంప్రదాయాలు, సంస్కృతి అన్నింటినీ 40 నిమిషాల నిడివిలో చూపించారు.
Read Also : Actor Janardhan : 18 ఏళ్లు ఆమెతో ఎఫైర్ నడిపా.. నా భార్య సపోర్ట్ చేసింది\
ఇక తాజాగా ఈ డాక్యుమెంటరీ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ETV Win లోకి స్ట్రీమింగ్‌కి వచ్చింది. నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. టెక్నికల్ గా చాలా క్వాలిటీతో తీశారు ఈ డాక్యుమెంటరీని. ప్రొద్దుటూరులో దసరా టైమ్ లో కనిపించే వైభవం, భక్తి, ప్రజల సంతోషాన్ని చాలా నేచురల్ గా.. ఎంతో క్వాలిటీగా తీసుకొచ్చారు. కొత్త టీం అయినా ఈ డాక్యుమెంటరీని ఎంతో సీనియర్లు తీసినట్టే రూపొందించారు. స్టార్ సర్కిల్స్ డిజిటల్ ఈ మూవీని ప్రమోట్ చేయగా.. కిలారి సుబ్బారావు PROగా పని చేశారు. మన లోకల్ సంప్రదాయాలను ఒడిసిపట్టే ఇలాంటి డాక్యుమెంటరీలు కల్చర్ కు నిలువుటద్దం పడుతాయి అంటున్నారు టీమ్.
Read Also : Chikiri Chikiri: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే!
