NTV Telugu Site icon

Pro Kabaddi League: కండల బలమే ఆయుధంగా.. మైదానమే రణస్థలంగా.. బాలయ్య కబడ్డీ

Balayya

Balayya

Pro Kabaddi League: ఇండియా ఫైనల్స్ లో ఓడిపోయి ఇండియన్స్ ను మొత్తం నిరాశలో ముంచేసింది. ఎన్నో ఏళ్ళ తరువాత ఇండియా ఫైనల్స్ కు వెళ్లడంతో .. ఈసారి కచ్చితంగా కప్పు కొడతాం అని అనుకున్నారు కానీ, ఈసారి కూడా అదృష్టం కలిసిరాలేదు. ఇక క్రికెట్ నుంచి బయటపడడానికి వచ్చేసింది కబడ్డీ. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ప్రో కబడ్డీ లీగ్ మొదలుకానుంది. డిసెంబర్ 2 నుంచి స్టార్ స్పోర్ట్స్ మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రో కబడ్డీ లీగ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక దీనికోసం ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలయ్యాయి. అంతకుముందు ప్రో కబడ్డీ లీగ్ కు రానా దగ్గుబాటి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇక ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగాడు. మొన్నటివరకు యాడ్స్ చేయని బాలయ్య.. ఈ మధ్య యాడ్స్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.

Local BoI Nani: ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం.. కీలక విషయాలు బయటపెట్టిన లోకల్ బాయ్ నాని స్నేహితులు

తాజాగా ప్రో కబడ్డీ లీగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.ఇందులో నందమూరి బాలకృష్ణతో పాటు కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ యుద్ధ వీరులుగా కనిపించారు. “కబడ్డీ.. మన మట్టిలో పుట్టిన ఆట మన తెలుగువాడి పౌరుషాన్ని తెలిపే ఆట కండల బలమే ఆయుధంగా మైదానమే రణస్థలంగా పోరాడే ఈ దమ్మున్న ఆటను అస్సలు మిస్ కావద్దు” అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇందులో బాలయ్య లుక్ ఆకట్టుకుంటుంది. యుద్దానికి కదిలి వస్తున్న వీరులకు బాలయ్య ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే బాబీ దర్శకత్వంలో NBK 109 చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Show comments