Site icon NTV Telugu

Priyanka Jawalkar : కిల్లింగ్ లుక్స్ తో మతి పోగొడుతున్న ప్రియాంక..

Whatsapp Image 2023 07 04 At 1.21.10 Pm

Whatsapp Image 2023 07 04 At 1.21.10 Pm

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన గ్లామర్ తో అందాల విందు చేసి ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడికి తెలుగులో సరైన హిట్ లభించలేదు.. ఇప్పటికీ తన కెరీర్ ను నిలబెట్టే సినిమా  కోసం ఎదురు చూస్తోంది.తెలుగు లో వరుస అవకాశాల కోసం ప్రియాంక జవాల్కర్ తెగ ప్రయత్నిస్తుంది.అయితే ప్రియాంక జవాల్కర్ ఇప్పటి వరకు తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లోనే నటించింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఆ తరువాత ‘తిమ్మరుసు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మరియు ‘గమనం’ వంటి చిత్రాలతో నటించింది.ఇందులో ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ తో సినిమా మంచి విజయం అందుకుంది. ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాలో ఈ భామ కిరణ్ అబ్బవరం కు జోడి గా నటించింది. ఈ సినిమాలో ఈ అమ్మడి నడుము అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లుకు అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి.అందుకే ప్రియాంక జవాల్కర్ వచ్చిన అవకాశాలను కాదనకుండా ఓకే చెబుతోంది. ఈ క్రమంలోనే బాలయ్య చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం..అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబోలో వస్తున్న ‘భగవంత్ కేసరి’లో ఈ ముద్దుగుమ్మ ఓ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. ఈ విధంగా తెలుగులో వరుస సినిమాలలో నటించాలి అనుకుంటుంది ఈ భామ. ప్రస్తుతం భగవంత్ కేసరి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రియాంక జవాల్కర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర పోస్టులను పోస్ట్ చేస్తుంది..మరోవైపు గ్లామర్ ఫొటోషూట్లతో కూడా రచ్చ చేస్తోంది. తాజాగా టైట్ ఫిట్ లో అందాల విందు చేసింది. క్లీవేజ్ షో తో రెచ్చగొడుతుంది..కిల్లింగ్ లుక్స్ తో సూటిగా చూస్తూ మతిపోగొడుతుంది.ఈ అమ్మడి స్టన్నింగ్ ఫోజులకు  నెటిజన్లు ఫిదా అవుతున్నారు.వరుసగా హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Exit mobile version