Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సినీ ప్రయాణం మొదలైన సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌తో కలిసి నటించిన ‘తమిళన్’ (Thamizhan) సినిమానే ప్రియాంకకు తొలి చిత్రం. ఈ నేపథ్యంలో అప్పట్లో విజయ్ గురించి ఆమె చెప్పిన మాటలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
2002లో విడుదలైన ‘తమిళన్’ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ సమయంలో తనకు తమిళ భాష అసలు రాదని, డైలాగులను పేపర్‌పై రాసుకుని బట్టీపట్టి చెప్పేదాన్నని తెలిపారు. సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో కూడా అప్పటి వరకు తెలియదని చెప్పారు.. ‘నాకు సినిమాలు థియేటర్‌లో చూడడం మాత్రమే తెలుసు. కానీ ‘తమిళన్’ షూటింగ్ సమయంలో సెట్స్‌లో చూసిన వాతావరణం నాకు పూర్తిగా కొత్తగా అనిపించింది. విజయ్‌ను చూడటానికి వందలాది అభిమానులు వచ్చేవారు. ఆయన డ్యాన్స్ చేస్తున్నా, డైలాగులు చెబుతున్నా అందరూ మైమరచి చూస్తుండేవారు. ఆయనకు ఉన్న అభిమానాన్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అందరూ విజయ్‌ను దేవుడిలా చూస్తున్నారని అనిపించింది’ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చా.
Also Read
- TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
- Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
- Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
- Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. 'అంతా రాములోరు చూస్కుంటారు' అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
2002లో విడుదలైన ‘తమిళన్’ సినిమా ప్రియాంక చోప్రాకు మాత్రమే కాదు, దర్శకుడు మజిత్‌కూ తొలి చిత్రమే కావడం విశేషం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా విజయ్–ప్రియాంక జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ప్రియాంక చెప్పిన ఈ మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!