NTV Telugu Site icon

Priyanka Chopra: మూతపడనున్న ప్రియాంక చోప్రా ‘సోనా’ రెస్టారెంట్.. ఎందుకో తెలుసా?

Priyanka Chopra Latest Pics Goes Viral

Priyanka Chopra Restaurant Sona Closed :గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా మూడేళ్ల క్రితం అమెరికాలో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించింది, దానికి ఆమె సోనా అని పేరు పెట్టారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత, ఈ న్యూయార్క్ బేస్డ్ రెస్టారెంట్ ను మూసివేయబోతోంది. దీనికి సంబంధించి టీమ్ అధికారిక ప్రకటనను కూడా షేర్ చేసింది.. జూన్ 30న చివరిసారిగా ఇక్కడ భోజనం వడ్డిస్తామని ప్రకటిచింది. సోనా రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటంటే, భారతీయ వంటకాలు ఆధునిక హంగులతో ఇక్కడ వడ్డిస్తారు. ఈ మూడేళ్లలో, చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ప్రియాంక చోప్రా రెస్టారెంట్‌లో తిని ఆనందించారు, ఈ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు నటి స్వయంగా పూజలు చేయగా ఆమె భర్త నిక్ జోనాస్ కూడా వాటిలో పాల్గొన్నారు.

Gannavaram Airport: సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలోకి గన్నవరం ఎయిర్‌పోర్టు భద్రత.. డీజీపీకి లేఖ

ఒక సంవత్సరం క్రితం ప్రియాంక చోప్రా రెస్టారెంట్ నుండి తన వాటా ఉపసంహరించుకుంది. తన వ్యాపార భాగస్వామితో కొన్ని సమస్యల కారణంగా ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడు నటి వెనక్కి తగ్గడంతో సోనా టీం ఈ రెస్టారెంట్‌ను మూసివేయాలని నిర్ణయించుకుంది, దీనికి సంబంధించిన అప్డేట్ ను కూడా షేర్ చేసుకుంది. అయితే, దీని మూసివేత వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. రెస్టారెంట్ బృందం జూన్ 19 న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. ‘మూడేళ్ల అందమైన ప్రయాణం తర్వాత సోనా ఇప్పుడు ఆగిపోబోతోంది. మీకు సేవ చేసే అవకాశం మాకు లభించినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇది మాకు గౌరవప్రదమైన విషయం. చివరి బ్రంచ్ జూన్ 30న అందించబడుతుందని ఈ పోస్ట్‌లో చెప్పబడింది. 2021లో ప్రియాంక చోప్రా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. తన స్నేహితుడు మనీష్ గోయల్‌తో కలిసి ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. అనుపమ్ ఖేర్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ నుండి మిండీ కాలింగ్ వంటి ప్రముఖులు ఈ ఓపెనింగ్ లో కనిపించారు.

Show comments