Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా మారింది. అమెరికా కోడలుగా మారిన తర్వాత అమ్మడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తున్న పీసీ.. మరోపక్క తల్లిగా కూడా మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో దర్శనమిచ్చే ఈ బ్యూటీ తాజాగా స్విమ్మింగ్ పూల్ లో సేదతీరుతూ కనిపించింది. పూల్ సైడ్ ఫోటోలను షేర్ చేయడానికి ప్రియాంక ఏనాడు జంకింది లేదు.
పెళ్లి అయినా అమ్మడి హాట్ ప్రదర్శనలకు కొదువే లేదు. అయితే ఈ పూల్ వీడియోలో కొద్దిగా మితిమీరి కనిపించిందని అభిమానులు అంటున్నారు. బ్లాక్ కలర్ టూ పీస్ బికినీలో జల కన్యలా ఈత కొట్టి పైకి వస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తడిసిన అందాల మధ్య పీసీ నడుము అందాలు హైలైట్ గా నిలిచాయి. ఇంకా చెప్పాలంటే కొద్దిగా డర్టీగానే కనిపించాయి. ఇక దీనిపై పీసీ అభిమానులు ఒక రకంగా.. నెటిజన్లు మరో రకంగా కామెంట్లు వినిపిస్తున్నారు. ప్రియాంక అందాల విందు బావుంది అని కొందరు అంటుంటే.. ఛీ మరీ ఇంత దారుణంగా ఏంటి ప్రియాంక అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ప్రియాంక ప్రస్తుతం `సిటాడెల్` వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
