NTV Telugu Site icon

Pawan Kalyan: ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ.. లక్కీ ఛాన్స్ పట్టేశావ్..?

Priyanka

Priyanka

Pawan Kalyan:న్యాచురల్ స్టార్ నాని పరిచయం చేసిన హీరోయిన్స్ లో ప్రియాంక అరుళ్ మోహన్ ఒకరు. గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ మొదటిసినిమాతోనే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా..? అని నానితోనే కాదు.. తెలుగు ప్రేక్షకులందరి తోనూ అనిపించేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో నటించి మెప్పించింది. అయితే అమ్మడికి మాత్రం తెలుగులో సరైన హిట్ లేదనే చెప్పాలి. ఇక తాజాగా ఈ చిన్నది ఒక లక్కీ ఛాన్స్ పట్టేసిందని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లకు అందని అవకాశం.. ప్రియాంకకు అందినట్లు చెప్పుకొస్తున్నారు.

Balagam Mogilaiah: ‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ పాట పాడి ఏడిపించిన మొగిలయ్య కి తీవ్ర అస్వస్థత

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపేట్టే ప్రతి హీరోయిన్.. ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ సరసన నటించాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ ను ప్రియాంక చేజిక్కించుకుందని టాక్. ప్రస్తుతం పవన్ నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని తెలుస్తోంది. కొద్దిగా ఫ్రెష్ ఫేస్ కావాలని సుజీత్ భావిస్తున్నాడట. అందుకే ప్రియాంకను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే అమ్మడి రేంజ్ మారినట్లే అని చెప్పాలి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.