NTV Telugu Site icon

Priyanka Chopra: ప్రియాంక చోప్రా కూతురిని చూసారా? కనిపించడం ఫస్ట్ టైమ్

Priyanka Chopra

Priyanka Chopra

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి అక్కడ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ ‘ప్రియాంక చోప్రా’. అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో ప్రియాంకకి మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో ఉంటున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ టైం తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఏడాది వయసున్న మాలతి మారి చోప్రా జోనాస్ ఎలా ఉంటుందో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఇటివలే మాలతి మారి చోప్రా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడంతో ప్రియాంక, పాపని బయటకి తీసుకోని వచ్చి ప్రపంచానికి చూపించింది. ప్రస్తుతం ప్రియాంక కూతురి  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: Amigos: ‘ఎన్నో రాత్రులు’ వచ్చేది ఈరోజు సాయంత్రమే…

అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్ ని ప్రేమించిన ప్రియాంక వివాహం చేసుకున్నారు. 2018 డిసెంబర్ లో వీరి వివాహం జరిగింది. పెళ్ళైన నాలుగేళ్లకు 2022 జనవరిలో సరోగసీ ద్వారా ప్రియాంక తల్లి అయ్యింది కానీ ఇప్పటివరకూ తన కూతురు ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియనివ్వలేదు ప్రియాంక. ఇటివలే జరిగిన ‘జోనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్’ సెరిమోనికి భర్త నిక్ తో పాటు హాజరైన ప్రియాంక ఈ ఈవెంట్లో ‘మాలతి’ ఫేస్ రివీల్ చేసింది.

Read Also:Pathan Effect: వెనక్కి వెళ్లిన అల వైకుంఠపురం లో రీమేక్

Show comments