Site icon NTV Telugu

Priyamani: ద‌ర్శ‌కుల్ని సంతృప్తి ప‌రచ‌డ‌మే నాప‌ని.. ఆ కోరిక తీరడం లేదు

Priyamani

Priyamani

Priyamani: హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె నటించిన భామాకలాపం 2 రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ప్రియమణి పాల్గొంటుంది. ఇప్పటికే భామాకలాపం హిట్ అవ్వగా దానికి సీక్వెల్ గా భామాకలాపం 2 రిలీజ్ అవుతుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి తన మనసులో మాటలను బయటపెట్టింది. ఎన్ని పాత్రలు చేశాను కానీ తనకు ఇంకొన్ని పాత్రలు చేయాలని కోరికగా ఉందని చెప్పుకొచ్చింది. ” నాకు వెంకటేష్ గారితో కలిసి నటించాలని ఉండేది. ఆయన ఏదైనా ఫంక్షన్ లో కనిపించినా నేను నా మనసులోని మాటను చెప్పేదాన్ని. అలా నా కోరిక నారప్ప సినిమాతో నెరవేరింది. వెంకటేష్ గారు చాలా పెద్ద స్టార్ అయినా కూడా సెట్ లో చాలా సింపుల్ గా ఉంటారు. అందరితో చాలా సరదాగా మాట్లాడతారు.

ఇక నేను కెరీర్ మొదలుపెట్టినపట్టినుంచి ఎన్నో పాత్రలు చేశాను. కానీ, ఇప్పటికీ నా మనసులో రెండు కోరికలు మాత్రం అలాగే ఉండిపోయాయి. నాకు పూర్తిగా కామెడీ చేసే పాత్ర చేయాలని ఉంది. అంతేకాకుండా బాగా పవర్ ఫుల్ నెగెటివ్ పాత్రలో నటించాలని ఉంది. అలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. పాత్రల విషయంలో నాకు కండిషన్స్ లేవు. దర్శకుడు ఎలా చెప్తే చేస్తాన. నన్ను నమ్మి పాత్ర ఇచ్చిన ద‌ర్శ‌కుల్ని సంతృప్తి ప‌రచ‌డ‌మే నాప‌ని. అందుకే ఇంకా సినిమాలు చేయగలుగుతున్నాను. న‌న్ను తెర‌పై ఫ‌లానా పాత్ర‌లో చూసుకోవాల‌ని ఎప్ప‌టి నుంచి క‌ల‌లు కంటున్నాను. అలాంటి అవకాశాలు వస్తాయనే కలలు కంటున్నాను. అందుకే సినిమాలు చేస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version