“ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ప్రియమణి తన బలమైన పాత్రతో బాలీవడ్ తో పాటు దక్షిణాదిలోనూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటీమణులు మొత్తం సినిమాను తమ భుజాలపై మోయగలిగేలా కాలం మారిందని అభిపాయ పడింది.
Read Also : లాహే సిస్టర్స్ తో ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లాఫింగ్ రైడ్!
“ఖచ్చితంగా పరిస్థితులు మారాయి. హీరోయిన్ అంటే గ్లామర్ గా, పొట్టి బట్టలు ధరించే రోజులు, పెద్ద హీరో సరసన రొమాంటిక్ లీడ్ మాత్రమే చేసే రోజులు పోయాయి. హీరోయిన్‌కి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఉదాహరణకు సమంత ‘ఓ బేబీ’ చేసింది. నయనతార చాలా బాగా రాణిస్తోంది.ఆమె రజనీకాంత్, విజయ్ సరసన జత కట్టి, మరో పక్క నేత్రికన్, మాయ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లలో కూడా నటిస్తోంది.
కాలం మారిందని, ఎక్కడైనా హీరోయిన్లు కేవలం గ్లామర్ లేదా రొమాన్స్ కోసం మాత్రమే కాదని ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. సినిమా రంగానికి వారి సహకారం అంతకు మించి ఉంది. ఇప్పుడు మనలో చాలా మందికి సమానమైన ప్రాముఖ్యత లభిస్తున్న విషయం తెలిసిందే” అంటూ ఇండస్ట్రీలో వచ్చిన మార్పు చేర్పుల గురించి వెల్లడించింది.
