Site icon NTV Telugu

Priyadarshi : నన్నెందుకు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారో అర్ధం కాలేదు!

Priyadarshi

Priyadarshi

Priyadarshi : ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్‌గా రూపొందిన తాజా చిత్రం ‘మిత్రమండలి’. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టారని తెలియడంతో, సినిమా హీరో ప్రియదర్శిని అడుగగా, ఈ విషయం తనకు ఆశ్చర్యంగానే అనిపిస్తోందని అన్నారు. “నిజానికి నాకు ఇంతకుముందు ఇలా ఎప్పుడూ జరగలేదు. అది కూడా ఒకే ఐపీ అడ్రస్ నుంచి 300 ఐడీలతో కామెంట్స్ పెట్టించారు అని తెలిసి షాక్ అయ్యాను. ఇది ఎవరు చేస్తున్నారు, ఏంటో నాకు అర్థం కావడం లేదు.

Read Also : Flora Saini : పెళ్లి వద్దు.. శృంగారమే ముద్దు.. ఫ్లోరా బోల్డ్ కామెంట్స్

దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు. అయితే ఒకటే మాత్రం చెప్పగలను, ఇప్పటికే దీని మీద సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం. చట్టం తన పని తాను చేసుకోబోతోంది” అని ఆయన అన్నారు.ఏదేమైనా, ఇలా టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ చేయడం తప్పు. “ఏదైనా నేను తప్పు చేస్తే నన్ను విమర్శించవచ్చు, కానీ ఇలా చేయడం మాత్రం ఇబ్బందికరమే. నా సినిమా అని ఇలా చేస్తున్నారు, లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో నాకు తెలియదు” అని ప్రియదర్శి అన్నారు.

Exit mobile version