Site icon NTV Telugu

Prithviraj Sukumaran: 5 మినిట్స్ లిప్ లాక్ .. నాగార్జున రికార్డ్ కు బ్రేక్.. ?

Akkineni

Akkineni

Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సలార్ సినిమాతో ఆయనకు మరింత గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న చిత్రం ఆడు జీవితం. ది గోట్ లైఫ్. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా మలయాళం అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ గోట్‌లైఫ్ మూవీని తెరకెక్కించారు. రెండు గంటల నలభై ఒక్క నిమిషాల నిడివితో గోట్‌లైఫ్ తెలుగులో రిలీజ్ కానుంది..రెండు గంటల యాభై రెండు నిమిషాల లెంగ్త్‌తో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే సెన్సార్ సభ్యులు కొన్ని సీన్స్‌కు అభ్యంతరాలు చెప్పినట్లు తెలిసింది. దాంతో పదకొండు నిమిషాలు పైనే సినిమాను ట్రిమ్‌ చేసి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి సెన్సార్ నుంచి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.గోట్‌లైఫ్ సినిమాలో అమలాపాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ మూవీలో పృథ్వీరాజ్‌సుకుమారన్‌, అమలాపాల్ మధ్య లిప్‌లాక్ సీన్ ఉండబోతున్నట్లు సమాచారం.. ఐదు నిమిషాల కంటే ఎక్కువ నిడివితోనే ఈ లిప్‌లాక్ సీన్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక దీంతో ఇప్పటివరకు ఈ రేంజ్ లిప్ లాక్ ను ఇంతకుముందు ఎవరు పెట్టారు అనేదాని మీద సెర్చ్ చేస్తే మన్మధుడు నాగార్జున గురించే చెప్పాలి. ఇప్పుడంటే ఈ లిప్ లాక్ లు కామన్ అయ్యాయి. కానీ గీతాంజలి సినిమాలోనే నాగ్.. గిరిజకు దాదాపు బ్రేక్ లేకుండా రెండున్నర నిమిషాల పాటు లిప్ లాక్ పెట్టాడు. ఓం నమః సాంగ్ మొత్తం వారి ముద్దు చుట్టూనే తిరుగుతుంది. ఇప్పటివరకు అదే బ్రేక్ ఈవెన్ లిప్ లాక్. ఇప్పుడు పృథ్వీరాజ్.. ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తాడని అంటున్నారు. మరి ఈ సినిమాతో ఈ మలయాళ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version