Site icon NTV Telugu

మరో మూవీకి లేడీ సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ?

Prithviraj Sukumaran and Nayanthara to pair up for Alphonse Puthren film?

లేడీ సూపర్ స్టార్ నయనతార మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పలు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఓ మాయల సినిమాలో నటించడానికి నయన్ ఓకే చెప్పిందని అంటున్నారు. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో ప్రేమమ్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రెన్‌తో మూవీ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్-అల్ఫోన్స్ పుత్రెన్‌ సన్నిహిత వర్గాలు క్రేజీ అప్‌డేట్‌ను వెల్లడించాయి.

Read Also : “శ్రీదేవి సోడా సెంటర్”కు మహేష్ సాయం

తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతారను ఈ చిత్రంలో కథానాయికగా నటించడానికి సంప్రదించారు. నయన్ ఈ సినిమాకు ఓకే చెప్తే నయనతార, పృథ్వీరాజ్‌ జంట మొదటిసారి వెండి తెరపై ప్రేక్షకులను అలరించనుంది. ఈ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “తిరువోనమ్” సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకాలపై పృథ్వీరాజ్ సుకుమారన్, అల్ఫోన్స్ పుత్రెన్, ఆయన భార్య సుప్రియ మీనన్ నిర్మించనున్నారు.

Exit mobile version