NTV Telugu Site icon

Prithiveeraj Sukumaran : తప్పుచేయలేదు.. ఎవరికీ భయపడం.. పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్

Prithveeraj

Prithveeraj

Prithiveeraj Sukumaran : మళయాల నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ చుట్టూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. మొన్నటి వరకు ఎల్2 ఎంపురాన్ విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. దాని తర్వాత ఈడీ అధికారులు పృథ్వీరాజ్ కు నోటీసులు పంపారు. ఈ విషయం మళయాల ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ నోటీసులపై పృథ్వీరాజ్ తల్లి, నటి మల్లిక స్పందించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదన్నారు. తాము ధైర్యంగా విచారణ ఎదుర్కుంటామని తెలిపారు. తప్పు చేయనప్పుడు చట్టానికి సమాధానం ధైర్యంగానే చెప్తామన్నారు.

Read Also : Microsoft: ‘‘మీకెంత ధైర్యం?’’.. మైక్రోసాఫ్ట్ బాస్‌లపై భారత సంతతి టెక్కీ ఆగ్రహం.. కారణం ఇదే..

‘మా విషయంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. అయినా మాకు భయం లేదు. మమ్ముట్టి మాకు అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన స్పెషల్ గా మా కోసం మెసేజ్ పంపారు. అన్నీ సర్దుకుంటాయి అంటూ ధైర్యం చెప్పారు. మాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ తెలిపింది మల్లిక. పృథ్వీరాజ్ గతంలో నాలుగు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. గోల్డ్, కడువా, జనగణమన సినిమాల్లో నటించినందుకు పారితోషికం తీసుకోకుండా కో ప్రొడ్యూసర్ కోటాలో రూ.40 కోట్ల వరకు తీసుకున్నారని.. వాటి లెక్కలు చెప్పాలంటూ ఈడీ నోటీసులు పంపించింది.