Site icon NTV Telugu

Upasana Konidela: మొదటిసారి బేబీ బంప్ తో కనిపించిన మెగా కోడలు.. రూమర్స్ కు చెక్

Charan

Charan

Upasana Konidela: మెగాస్టార్ ఇంటికి త్వరలోనే మెగా వారసుడు రానున్న సంగతి తెల్సిందే. దాదాపు పదేళ్ల తరువాత మెగా కోడలు ఉపాసన.. తల్లి కాబోతుంది. దీంతో మెగా కుటుంబంలో ఆనాడు అవధులు లేవు. చరణ్ కు ఉపాసన బెస్ట్ ఫ్రెండ్. ఈ స్నేహం, ప్రేమగా మారి, ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అయిన దగ్గరనుంచి ఉపాసన ఎన్నో అవమానాలను, విమర్శలను ఎదుర్కొంటూనే వచ్చింది. ఆమె ముఖం బాలేదని, రామ్ చరణ్ కు సెట్ కాలేదని ఎన్నో మాటలు అన్నారు. కానీ, ఆమె వాటిని పట్టించుకోకుండా సక్సెస్ ను అందుకొని అందరి నోర్లను మూయించింది. ముఖ్యంగా ఎంతో మంది పేదవారికి హెల్ప్ చేసి హేళన చేసినవారి నోటినుంచే శభాష్ అని అనిపించుకుంది. ఇక ఉపాసన- చరణ్ పిల్లల విషయంలో కూడా ఎన్నో రూమర్స్ బయటకి వచ్చాయి.

RRR: చరణ్ బర్త్ డే వేడుకల్లో ఆర్ ఆర్ ఆర్ టీంకి ‘చిరు’ సన్మానం…

పెళ్ళై పదేళ్లు అయినా ఇంకా గర్భవతి కాకపోయేసరికి అసలు ఆమెకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని కూడా విమర్శించారు. వారందరికీ సమాధానంగా గతేడాది.. ఉపాసన అభిమానులందరికి తీపి కబురు చెప్పింది. తన పిల్లలను ఎలా పెంచాలో.. వారికి ఎటువంటి లోటు కలగనుండా చూసుకోగలం అనుకున్నప్పుడు తాము తల్లిదండ్రులుగా మారతామని ఎప్పుడు చెప్పుకొచ్చింది ఉపాసన చెప్పినట్టుగానే తమా బిడ్డల కోసం అన్ని సమకూర్చి.. ఇప్పుడు మాతృత్వపు మధురిమల కోసం ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఉపాసనకు ఆరో నెల. ఈ విషయాన్నీ చరణ్ ఆస్కార్ అవార్డుల కోసం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఉపాసన తన బేబీ బంప్ తో బయట కనిపించింది లేదు. దీంతో అభిమానులు కొద్దిగా అనుమానం వ్యక్తం చేశారు. ఇక గత రాత్రి తన బెస్ట్ ఫ్రెండ్, హస్బెండ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ఆమె బేబీ బంప్ తో దర్శనమిచ్చి పార్టీకే హైలైట్ గా నిలిచింది. బ్లూ కలర్ టైట్ డిజైనర్ డ్రెస్ లో ఉపాసన.. బేబీ బంప్ తో చరణ్ పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version