Hanuman: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అ!, కల్కి, జాంబీ రెడ్డి సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. మొట్ట మొదటి టాలీవుడ్ సూపర్ హీరో చిత్రంగా హనుమాన్ తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ విజువల్స్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక నేడు ఆదిపురుష్ చూశాక అందరి చూపు హనుమాన్ మీద పడింది. ఆదిపురుష్ ను ఈ జనరేషన్ కు తగ్గట్టు మోడ్రన్ గా తెరకెక్కించారని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మనకు తెలిసిన రామాయణం వేరు.. ఆదిపురుష్ రామాయణం వేరు అంటూ పెదవి విరుస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తమ సినిమా హనుమాన్ గురించి ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Salaar: సలార్ లో రాఖీ భాయ్.. కథ తెలిసిపోయింది..?
” మేము రిస్క్ చేయడం లేదు. హనుమాన్ ను మోడ్రనైజ్ చేసి చూపించడం లేదు. చిన్నతనం నుంచి హనుమంతుడు అందరికి ఎలా తెలుసో.. అలాగే చూపిస్తున్నాను.హనుమంతుని పాత్ర కోసం మేమందరం ఏడాది పాటు రీసెర్చ్ చేసాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ హిట్ అందుకుంటాడా..? లేదా..? అనేది చూడాలి.