Prashanth Varma Comments on Hollywood Producers goes viral in Social media: తెలుగు సినీ పరిశ్రమలో ఆ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి అనే సినిమా చేశాడు. ప్రయోగాత్మక సినిమాగా పేరు తెచ్చుకున్న ఆ సినిమా చాలా మందికి నచ్చింది కానీ కల్కి సినిమా రొటీన్ అనిపించి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా చేసిన జాంబీ రెడ్డి మాత్రం ఓ మాదిరి హిట్ అందుకుంది. మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఇప్పుడు ఆయన చేసిన హనుమాన్ సినిమా మాత్రం ఒక రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తోంది. జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి మిగతా అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడమే గాక నార్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తాను అనుకున్న ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు ఒక్కొక్కటిగా బయటకు వదులుతానని ప్రశాంత్ వర్మ ప్రకటించారు.
Animal : యానిమల్ ఓటీటీ రిలీజ్ కు లైన్ క్లియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
అందులో భాగంగానే నిన్న అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జై హనుమాన్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే మనం ఇక్కడ ఎలా అయితే రిలీజ్ డేట్స్ గురించి వేరే ప్రొడ్యూసర్స్ తో డిస్కషన్ పెడుతున్నామో హాలీవుడ్ వాళ్లు కూడా ఇండియా నుంచి ఏం సినిమా వస్తుందని మనతో డిస్కషన్ పెట్టే రేంజ్కి తీసుకువెళ్లడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఈ హనుమాన్ సినిమా కూడా కేవలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనే కాక కొన్ని ఫారెన్ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇక్కడ సక్సెస్ ని బట్టి అక్కడ ఎప్పుడు, ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అని ఆలోచించారు. ఇక్కడ సూపర్ హిట్ కావడంతో ఇక ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.