Jai Hanuman : జై హనుమాన్ లో ఆ హై సినిమా అంతా ఉంటుంది!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Varma Comments at Hanuman 50 Days Event: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించగా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. సక్సెస్ ఫుల్ గా 50 రోజులని పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది. హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. 50 రోజుల పండుగ చూసి చాలా కాలమైంది, అది హనుమాన్ సినిమాకి జరగడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. ఒక సక్సెస్ ఫుల్ సినిమా చాలా మంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్ ఇలా చాలా మంది జీవితాలని మారుస్తుంది. అది సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. హనుమాన్ లాంటి సినిమా 50 రోజులు 150 థియేటర్స్ లో నడిచిందని చాలా మందికి నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం. నా మొదటి ‘అ’, నాని గారు నిర్మించారు. ఆ సినిమా క్రిటికల్ గా చాలా పేరు వచ్చింది అలాగే కమర్షియల్ గా మంచి హిట్ అయ్యింది. అయితే సక్సెస్ ని సక్సెస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని సక్సెస్ ఈవెంట్ చేయలేదు. సక్సెస్ ఈవెంట్ చేయలేదు కాబట్టి ఆ సినిమా కమర్షియల్ హిట్ కాలేదు అని చాలా మంది అనుకున్నారు.
Also Read
అందుకే సక్సెస్ ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, ఒక జెన్యూన్ హిట్ అనేది చాలా ముఖ్యం. ఇలాంటి వేడుకలో అంతా పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. సినిమాని ఆదరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. రీమాస్టర్డ్ వెర్షన్ వస్తుంది, అది మీకు ఇంకా సర్ప్రైజ్ చేయబోతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే సినిమాలకు హనుమాన్ విజయం గట్టి పునాది వేసింది. ప్రేక్షకులను అలరించే క్వాలిటీ సినిమాలు మా యూనివర్స్ నుంచి రెడీ చేస్తున్నాం. హనుమాన్ ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా త్వరలో జరగబోతుంది. హనుమాన్ ప్రపంచదేశాల్లో కూడా మన తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటుతుంది. హనుమాన్ 50 రోజుల అనేది ఒక స్టెప్ మాత్రమే. ఈ సినిమాతో ఇంకెన్నో స్టెప్స్ ఎక్కబోతున్నాం. ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సినిమాని సబ్మిట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అవార్డ్స్ వస్తాయనే నమ్మకం వుంది. జై హనుమాన్ వర్క్ స్టార్ట్ అయ్యింది, అతి త్వరలో దాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నాం. హనుమాన్ లో చివరి ఐదు నిమిషాలు ఎలా విపరీతంగా నచ్చిందో జై హనుమాన్ లో అది సినిమా అంతా ఉండబోతుంది. మీరు ఇచ్చిన ఈ సక్సెస్ ని భాద్యతగా తీసుకొని మీ రుణాన్ని జై హనుమాన్ తో తీర్చుకోబోతున్నాను. జై శ్రీరామ్.. జై హనుమాన్.. జై హిందీ” అన్నారు.
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!