Prashanth Varma about Not Releasing Hanuman on 1th January: ఈ సంక్రాంతికి ముందుగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయని అందరూ భావించారు. అయితే థియేటర్ల సర్దుబాటు కుదరక పోవడంతో ఈగల్ సినిమా సోలో రిలీజ్ హామీతో వెనక్కి వెళ్ళింది. అయితే జనవరి 12వ తేదీన రెండు సినిమాలు కాకుండా ఒక సినిమా మాత్రమే వస్తే థియేటర్ల సర్దుబాటు వ్యవహారం కాస్త ఈజీగా అయిపోతుందని అందరూ భావించారు. అయితే తాము ముందుగా ప్రకటించాము కాబట్టి 12వ తేదీ నుంచి వెనక్కి వెళ్లే అవకాశం లేదని, ఎందుకంటే హిందీలో తమ డిస్ట్రిబ్యూటర్ల అగ్రిమెంట్లు ముందే చేసేసుకున్నారు కాబట్టి వెనక్కి వెళ్లే అవకాశం లేదని హనుమాన్ టీమ్ ముందు నుంచి చెబుతూ వచ్చింది. గుంటూరు కారం టీం నుంచి ఎవరూ స్పందించలేదు కానీ తమది ఎలాగూ పెద్ద హీరో సినిమా కాబట్టి థియేటర్లు దొరుకుతాయని భావించి ఉండవచ్చు. అయితే 11వ తేదీన కొన్ని ప్రీమియర్స్ వేస్తున్నట్లు హనుమాన్ టీం ప్రకటించింది.
Hrithik Roshan: తెలుగు స్టేట్స్ లో గ్రాండ్ గా హృతిక్ రోషన్ పుట్టినరోజు వేడుకలు
అందుకు తగ్గట్టుగానే దాదాపు 350కి పైగా షోస్ వేస్తున్నట్లు టికెట్లు ఆన్లైన్ లో పెడితే అవన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. అలాంటప్పుడు 11వ తేదీనే సినిమాని రిలీజ్ చేయొచ్చు కదా అని దర్శకుడు ప్రశాంత్ వర్మను ప్రశ్నిస్తే ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. 11వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలు తర్వాత మాత్రమే హనుమాన్ సినిమా ప్రీమియర్ అవుతుందని ఎందుకంటే ఆ ఐదున్నర వరకు అమావాస్య ఘడియలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఆ గడియలు దాటిన తర్వాత మాత్రమే హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తమ సెంటిమెంట్తో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. తన సినిమా రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తుందని తాను నమ్ముతున్నానని ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు..
