NTV Telugu Site icon

Prashanth Neel: అవును.. కెజిఎఫ్ లో చేసిన తప్పులే సలార్ లో కూడా చేశా..

Prashnath

Prashnath

Prashanth Neel: ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. ఇక కెజిఎఫ్ లాంటిబిగ్గెస్ట్ హిట్ అందుకున్నాకా.. ప్రశాంత్ నీల్ ను టాలీవుడ్ లాగేసింది.. వరుసగా ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. ఒక్కో సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కించాడు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం పార్ట్ 1 డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ సైతం ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్.. కెజిఎఫ్, సలార్ కు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. మొదటి నుంచి కూడా సలార్ చాలా లేట్ అవుతూ వస్తుంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఇన్ ఫుట్ సరిగ్గా రాలేదని మళ్లీ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కెజిఎఫ్ సమయంలో కొన్ని తప్పులు దొర్లాయి.. అదే సలార్ టైమ్ లో కూడా జరిగినట్లు ప్రశాంత్ చెప్పుకురావడం హైలైట్ గా నిలిచింది. “కేజీఎఫ్‌లో చేసిన తప్పులే సలార్‌లో చేస్తున్నాను. ఆ సమయంలో మేము మొత్తం సినిమాని చూడడానికి.. చూసాక అవసరమైతే కొన్ని విషయాలను మార్చడానికి సమయం లేదు.
మళ్ళీ, సలార్ కు నేను గజిబిజి పరిస్థితిలో ఉన్నాను. కానీ మేము చేసిన దానికి మాత్రం సంతోషంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ తప్పులు ఏంటి.. ? లెంత్ విషయంలోనా.. ? లేక రీషూట్ విషయంలోనా.. ? లేక గ్రాఫిక్స్ విషయంలోనా అనేది క్లారిటీ లేదు. ఏదిఏమైనా ప్రభాస్ సలార్ మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.