కెజిఎఫ్.. కెజిఎఫ్.. కెజిఎఫ్.. ఆర్ఆర్ఆర్ తరువాత కెజిఎఫ్ 2 సినిమా హంగామా చేస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక దీంతో సినిమా ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో మొదలుపెట్టారు చిత్ర బృందం.. నిజం చెప్పాలంటే కెజిఎఫ్ 2.. ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవుతున్నారు. జక్కన్న లానే ప్రశాంత్ నీల్ కూడా దేశ వ్యాప్తంగా తిరిగి తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ప్రతి చోట ప్రశాంత్ తెలుగు వారిని మెప్పిస్తున్నాడు. నిన్నటికి నిన్న ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్ తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పిన ప్రశాంత్.. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళిని ఆకాశానికెత్తేశాడు.
‘చిన్న గల్లీలాంటి పాన్ ఇండియా సినిమాను ఎనిమిది లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేగా రాజమౌళి మార్చేశారు. సౌత్ సినిమా గురించి నేడు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఆయనే.. నిజం చెప్పాలంటే రాజమౌళి డైరెక్టర్ కాదు.. కాంట్రాక్టర్. ఒక్క టాలీవుడ్ లోనే కాదు దేశంలో ఏ ఇండస్ట్రీలోనైనా భారీ సినిమా తీయాలంటే రాజమౌళినే స్ఫూర్తి. ఆయన చిత్ర పరిశ్రమకు గర్వకారణం’ అని చెప్పుకొచ్చాడు. ఇక కెజిఎఫ్ 2 గురించి మాట్లాడుతూ.. కెజిఎఫ్ లో ఎలాంటి స్టార్లు లేరు.. కానీ చాప్టర్ 2 లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి స్టరాల్ను పెట్టేసి అటెన్షన్ కొట్టేశాడు అని చాలామంది అంటున్నారు. వాళ్లు స్టార్లే కావచ్చు. నాకు మాత్ర పాత్రలు అంతే’ అని తెలిపాడు. మరి ఏప్రిల్ 14 న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
