సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఎప్పుడూ తన సినిమాలతోనే కాదు, తన స్టైల్‌తో కూడా చర్చల్లో ఉంటారు. పుట్టింది బెంగళూరులో అయినా తెలుగు కుటుంబానికి చెందిన ప్రశాంత్ చిన్నప్పటి నుంచి టాలీవుడ్ ప్రభావంలో పెరిగాడు. ఆ ప్యాషన్నే ఆయన కెరీర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన దర్శకత్వం వహించిన కేజీఎఫ్ చాప్టర్ 1, 2, అలాగే సలార్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌గా నిలిచాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో “డ్రాగన్” (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఒక కామన్ ఫీచర్ అందరికీ తెలుసు ఆయన సినిమాలు అన్నీ డార్క్ షేడ్, ఇంటెన్స్ మూడ్ లోనే ఉంటాయి. హీరో నుంచి సపోర్టింగ్ ఆర్టిస్టుల వరకు అందరూ బ్లాక్ డ్రెస్ల్లో కనిపిస్తారు. షూటింగ్ లొకేషన్లు కూడా పొగతో, బొగ్గు బ్యాక్‌డ్రాప్‌లతో నిండిపోతాయి.
Also Read : Priyamani : “ఒకప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది: ప్రియమణి
ఈ కారణంగా అభిమానులు సరదాగా “నీల్‌కి ఈ బ్లాక్ మీద పిచ్చేంటి?” అని కామెంట్లు చేస్తుంటారు. అయితే, ఈ సారి మాత్రం ప్రశాంత్ నీల్ తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే ఆయన మొదటిసారి నల్ల దుస్తులు వదిలేసి తెల్ల సాంప్రదాయ డ్రెస్‌లో కనిపించాడు. ఒక కుటుంబ వేడుకలో భాగంగా అలా రెడి అయ్యారు. ఆ లుక్ చూసిన ఆయన భార్య లిఖితా రెడ్డి ఎమోషనల్ అయి, వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. “ఫైనల్‌గా నా దొంగ మొగుడు తెల్ల బట్టలు వేసాడు!” అని సరదాగా రాసిన లిఖితా పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. అభిమానులు కూడా ఆ ఫోటోపై ఫన్నీ, లవ్‌ఫుల్ కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడూ కఠినమైన, ఇంటెన్స్ లుక్‌లో కనిపించే ప్రశాంత్ నీల్ ఈ సారి సింపుల్ తెల్ల దుస్తుల్లో కనిపించడంతో, అభిమానులు “సర్కి ఈ లుక్ సూపర్‌గా సూట్ అయ్యింది” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమా భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఎన్టీఆర్‌తో కలసి మరోసారి తన డైరెక్షన్ మేజిక్ చూపించబోతున్న ప్రశాంత్ నీల్, ఇప్పుడు “వైట్ మోడ్”లోకి మారినట్టు కనిపిస్తోంది!